అజయ్ సిక్స్‌ప్యాక్ ఫోటో లీక్.. వైరల్‌గా మారిన లుక్.. ఏ సినిమా కోసమంటే!
విభిన్నమైన చిత్రాలు, విలక్షణమైన పాత్రలతో ఆకట్టుకొంటున్న టాలెంటెడ్ యాక్టర్ అజయ్ మరోసారి తన సత్తాను నిరూపించుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఓ ప్రతిష్టాత్మకమైన, భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కోసం తన దేహాదారుడ్యాన్ని పూర్తిగా మార్చుకొంటున్నట్టు సమాచారం. సిక్స్ ప్యాక్ లుక్ కోసం ఆయన చేస్తున్న కసరత్తుకు సంబంధించిన ఫోటో మీడియాకు లీకైంది. ప్రస్తుతం అజయ్ సిక్స్ ప్యాక్ ఫొటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.
గతంలో ఒక్కడు, ఖుషీ, విక్రమార్కుడు లాంటి సినిమాలతో దుమ్మురేపిన అజయ్.. ఇటీవల స్పెషల్ మూవీలో ఆయన నటనకు విమర్శకులు ప్రశంసలు లభించాయి. స్పెషల్ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి.

తాజాగా భారీ, ప్రతిష్టాత్మక చిత్రాల్లో క్రేజీ రోల్స్‌తో కెరీర్ పరంగా బిజీగా అయ్యారు. 2019, 2020 సంవత్సరాల్లో అజయ్ కెరీర్ మరో స్థాయికి వెళ్తుందనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అజయ్ సిక్స్‌ప్యాక్ ఫొటో ఏ సినిమాలోనిదనే విషయంపై చర్చ జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











