తృటిలో తప్పిన ప్రాణాపాయం.. స్వల్ప గాయాలతో బయటపడ్డ స్టార్ హీరో.. వీడియో వైరల్..
Ajith Kumar : కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అజిత్ కుమార్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇంటర్నేషనల్ కార్ రేసింగ్ పోటీల్లో పాల్గొనే నిమిత్తం ఆయనకార్ రేస్ ప్రాక్టీస్ చేస్తుండగా తాగారు నియంత్రణ కోల్పోయి అదుపు తప్పింది. కానీ పెను ప్రమాదం తృటిలో తప్పింది. చిన్నపాటి గాయాలతో హీరో అజిత్ కుమార్ పడినట్లు తెలుస్తోంది.
దుబాయ్ వేదికగా జరగనున్న 'Dubai 24 Hours Race'లో పాల్గొనడం కోసం అజిత్ కుమార్ వెళ్లారు. ఈ రేసులో పాల్గొనడానికి మంగళవారం ప్రాక్టీస్ పాల్గొన్నారు. ఈ సమయంలో హీరో అజిత్ కుమార్ నడుపుతున్న కారు నియంత్రణ కోల్పోయింది. దీంతో డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు గింగర్లు తిరుగుతూ ఆగిపోయింది.

అయితే.. ప్రమాదం జరిగిన తర్వాత సహాయక సిబ్బంది వెంటనే వచ్చి కారు డోర్ ఓపెన్ చేయడంతో అజిత్ కుమార్ కారులో నుంచి క్షేమంగా బయటకు వచ్చారు. దీంతో హీరో అజిత్‌కు పెను ప్రమాదం తప్పినట్టు, చిన్న చిన్నగాయాలతో బయటపడినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కు సినిమాలు అంటే ఎంత ఇష్టమూ.. అంతకంటే ఎక్కవగా రేసింగ్ అంటే చాలా ఇష్టం. ఆయనకు బైక్, కారు రేసులంటే.. ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన ప్రొఫెషనల్ రేస్ డ్రైవర్ కావడంతో ఏ కారు నడిపినా.. టాప్ స్పీడ్ లో 300 ఆపై స్పీడ్ తో నడిపిస్తూ ఉంటారు. ఆయన ఇప్పటికే పలు అంతర్జాతీయంగా కార్ రేస్ కాంపిటీషన్లో పాల్గొన్నారు.
వాస్తవానికి కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సంక్రాంతి బరిలో నిలుస్తారని ఆయన అభిమానులు ఆశించారు. కానీ, 'విడా మయూర్చి' వాయిదా పడింది. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో అర్జున్ సర్జా ప్రధాన పాత్ర పోషించారు. లైకా ప్రోడక్షన్స్ బ్యానర్‌పై జీకేఎం తమిళ్ కుమరన్ నేతృత్వంలో సుభాస్కరన్ నిర్మించారు. కానీ ఈ సినిమా వాయిదా పడింది.

ఇక మరో సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ సినిమాలో కూడా త్రిషనే హీరోయిన్‌గా నటిస్తోంది . 'మార్క్ ఆంటోని' ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో అజిత్ 'దుబాయ్ 24 అవర్స్ రేస్' లో పాల్గొనడానికి దుబాయ్ కి వెళ్ళాడు. ఈ రేసులో పాల్గొనడానికి ముందు ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే అజిత్ కారుకు ఘోర ప్రమాదం జరిగింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో తమ అభిమాన నటుడు ప్రమాదాన్ని గురి కావడంతో కోట్లాదిమంది అభిమానులు ఆందోళన చెందుతున్నారు. చిన్నపాటి గాయాలు అయినట్లు తెలియడంతో తమ హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అలాగే ఇకనైనా తన వేగాన్ని తగ్గించుకోవాలని, కార్ రేసులకు దూరంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











