Allu Arjun Arrest: FIR లో ఏముంది? అల్లు అర్జున్‌పై ఏ ఏ సెక్షన్ల కింద కేసు నమోదంటే?
Allu Arjun Arrest: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తో భారీ పాన్ ఇండియా మూవీ "పుష్ప 2" ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మూత మోగిస్తుంది సునామీల కలెక్షన్లను దుమ్ము రేపుతుంది. అయితే ఊహించని విధంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది. ఇంతకీ అల్లు అర్జున్ పై ఏ ఏ సెక్షన్ల కింద కేసు నమోదు అయిందంటే?
పుష్ప సినిమా విడుదల రోజున ప్రీమియర్స్ లో సంధ్య 70 ఎం ఎం థియేటర్ దగ్గర విషాద ఘటన తీవ్ర దుమారం రేపింది. పుష్ప 2 ప్రీరిలీజ్ సందర్భంగా.. హైదరాబాద్ సంధ్య థియేటర వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై అల్లు అర్జున్ కూడా స్పందించారు. ఈ ఆ కుటుంబానికి అండగా ఉంటానని, రూ. 25 లక్షల నష్టపరిహారాన్ని అందజేస్తామని తెలిపారు. మరి ఈ విషయంలో బాధిత కుటుంబం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ చేయగా కంప్లీట్ నమోదైంది.

మొదటగా థియేటర్ యాజమాన్యం ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఈ కేసులోనే అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. అనంతరం చిక్కడపల్లి పీఎస్ కు అల్లు అర్జున్ ను తరలించారు. ఈ కేసులో అల్లు అర్జున్ పై 105, 118(1) రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. 105 సెక్షన్ అనేది నాన్ బెయిలబుల్. ఒక వేళ నేరం రుజువైతే.. అల్లు అర్జున్ కు ఐదు నుంచి పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. మరోవైపు BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల వరకు శిక్షపడే అవకాశం ఉంటుంది. ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు. తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.
సంధ్య ధియేటర్ తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్న హెదరాబాద్ పోలీసులు#AlluArjun #AA #Arrest #Filmibeattelugu pic.twitter.com/EmBeplpKak
— TeluguFilmibeat (@TeluguFilmibeat) December 13, 2024


Click it and Unblock the Notifications











