Allu Sirish డిఫరెంట్ మూవీతో అల్లు వారసుడు.. నవంబర్ 4న రిలీజ్

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నటవారసుడిగా, అల్లు అర్జున్ సోదరుడిగా అల్లు శిరీష్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనకంటూ ఇమేజ్‌ను ఏర్పరుచుకొన్నారు. ఆ తర్వాత తన కంటూ సొంతంగా అభిమానులు ఏర్పరుచుకొన్నారు. గౌరవం లాంటి కంటెంట్ ఉన్న చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసి.. ఏకంగా దక్షిణాదికి పరిచయం అయ్యారు. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు.

కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే శిరీష్ గత 7 సంవత్సరాల్లో కేవలం 5 సినిమాల్లోనే నటించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో నటిస్తూనే .. మరో ఇద్దరు డైరెక్టర్లతో సినిమాలను పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. స్క్రిప్టులు ఫైనలైజ్ కాగానే సినిమాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ లోపు గీతా ఆర్ట్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

 Actor Allu Sirishs Geeta Arts movie to be release on November 4th, 2022

కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం లాంటి చిత్రాల్లో విభిన్నమైన పాత్రలతో నటుడిగా మంచి మార్కులు వేసుకొన్నారు. శిరీష్ చివరగా ఎబిసిడి అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి ఫలితాన్ని ఇవ్వకపోయినా శిరీష్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత శిరీష్ నుంచి ఇప్పటి వరకు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు.
మంచి కథ, డిఫరెంట్ పాత్ర కోసం ఎదురు చూసిన శిరీష్ ప్రస్తుతం హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో నటించిన చిత్రం రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.

గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు శిరీష్ నటించిన చిత్రం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొంటున్నది. ఈ సినిమాను నవంబర్ 4వ తేదీన విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్‌ను భారీగా మొదలుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. టైటిల్ ప్రకటన, ఫస్ట్ లుక్, ఫస్ట్ లుక్ టీజర్, ట్రైలర్‌ రిలీజ్ డేట్లను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X