మరో హిట్టుపై కన్నేసిన అనసూయ.. కథనంతో ఆగస్టు 9న..
యాంకర్, యాక్టర్ అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కథనం'. ది గాయత్రి ఫిల్మ్స్, ది మంత్ర ఎంటర్‌టైన్మెంట్స్, పతాకాలపై బి.నరేంద్రరెడ్డి, శర్మచుక్కా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. ఈ చిత్రానికి రోషన్ సాలూరి సంగీతం సమకూరుస్తుండగా, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. అవసరాల శ్రీనివాస్, రణధీర్, ధన్‌రాజ్, వెన్నెలకిషోర్, పెళ్లి పృధ్వీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చెసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ లో విడుదలకు సిద్దమవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర విశేషాల గురించి నిర్మాత నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ...అనసూయగారు ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన చిత్రమిది. ఆవిడ కెరీర్ లొ ఇదొక బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకం ఉంది.సెన్సార్ పూర్తయింది.యు/ఎ సర్టిఫికేట్ లభించింది. సెన్సార్ సభ్యుల ప్రశంసలు లభించాయి. ఆగస్ట్ 9 న సినిమా విడుదల చెస్తామన్నారు.

దర్శకుడు రాజేష్ నాదెండ్ల మాట్లాడుతూ... ఇది నా మొదటి చిత్రం.. క్షణం, రంగస్థలం తర్వాత ఆమె చేస్తున్న ఈ కథనం సినిమాతో హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అనసూయగారు. తప్పకుండ ఆమె తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది.. నరేంద్రరెడ్డిగారు పంపిణిదారునిగా ఏ సినిమా చేసిన హిట్.. నిర్మాతగా కూడా సక్సెస్ అవుతారన్నారన్న నమ్మకం ఉందన్నారు.
నటీనటులు: అనసూయ భరద్వాజ్, అవసరాల శ్రీనివాస్, రణధీర్, ధన్‌రాజ్, వెన్నెలకిషోర్, పెళ్లి పృధ్వీ, సమీర్, ముఖ్తార్‌ఖాన్, రామరాజు, జ్యోతి
ప్రొడక్షన్ కంట్రోలర్ః బాలాజీ శ్రీను,
ఎడిటర్ః ఎస్.బి. ఉద్దవ్,
మ్యూజిక్ః రోషన్ సాలూరి ,
ఆర్ట్ డైరెక్టర్ః కె.వి.రమణ,
రచయిత : రాజేంద్ర భరద్వాజ్,
డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీః సతీష్ ముత్యాల,
లైన్ ప్రొడ్యుసర్ : ఎమ్.విజయ చౌదరి,
నిర్మాతలుః బి.నరేంద్రరెడ్డి, శర్మ చుక్కా,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంఃరాజేష్ నాదెండ్ల


Click it and Unblock the Notifications











