హీరోయిన్ ఎస్తర్‌తో విడాకులు.. మాజీ భర్త నోయెల్ హాట్ కామెంట్స్.. టార్చర్ గురించి ఏమన్నాడంటే?
ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ ఎక్కడ చూసినా సెలబ్రెటీల విడాకుల గోలే వినిపిస్తోంది. తమ అభిమాన తారలు ఎలాంటి బాంబు పేలుస్తారోనని ఫ్యాన్స్ టెన్షన్‌లో ఉన్నారు. అయితే కొన్నేళ్ల కిందటే విడాకులు తీసుకుని కలకలం రేపారు సింగర్ నోయెల్- సినీ నటి ఎస్తర్ నోరోన్హా. ఏడాది కూడా కలిసి కాపురం చేయకుండానే ఈ జంట విడిపోవడం చర్చనీయాంశమైంది. చానాళ్ల తర్వాత వీరి విడాకుల ప్రస్తావన మళ్లీ వార్తల్లోకెక్కింది. ఈ వివరాల్లోకి వెళితే :
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన వేయి అబద్ధాలు సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చారు ఎస్తర్. ఆ వెంటనే భీమవరం బుల్లోడు సినిమాలో ఆమె నటించారు. కానీ ఆమె సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో త్వరగానే ఫేడవుట్ అయిపోయింది. మధ్యమధ్యలో చిన్నా చితకా చిత్రాల్లో నటించినా ఎస్తేర్‌కు అంతగా గుర్తింపు రాలేదు. కొంతకాలానికే నోయెల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ వైవాహిక జీవితం కూడా ఫెయిలై పెళ్లయిన ఏడాదికే ఎస్తేర్ విడాకులు తీసుకుంది.

విడాకుల తర్వాత ఎస్తర్ హద్దులు దాటేసింది అందాల ఆరబోతకు, రోమాంటిక్ సీన్లలో నటించేందుకు సైతం వెనుకాడటం లేదు. 69 సంస్కార్ కాలనీ, రెక్కీ సినిమాలలో బెడ్‌రూమ్ సీన్లలో రెచ్చిపోయి నటించింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండటంతో పాటు అప్పుడప్పుడు యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఎస్తర్. ఓ ఇంటర్వ్యూలో ఎస్తేర్ మాట్లాడుతూ.. నోయెల్‌తో ప్రేమ, పెళ్లి, విడాకుల గురించి కీలక విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే నోయెల్ తనను టార్చర్ చేశాడని చెప్పడం కలకలం రేపింది.
ఈ వ్యాఖ్యలపై నోయెల్ స్వయంగా స్పందించారు. ర్యాపర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఆయన మంచి సింగర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగానూ తన ముద్ర వేసిన ఆయన బిగ్‌బాస్ హౌస్‌లోనూ అలరించారు. సినీ నటి ఎస్తర్‌తో ప్రేమలో పడి ఆమెను పెళ్లాడారు. తాజా ఇంటర్వ్యూలో నోయెల్ మాట్లాడుతూ.. ఇద్దరం ఎంతో బాగుండేవాళ్లమని అన్నాడు. నా గురించి ఆమె చేసిన ఆరోపణలతో అంతా దూరమయ్యారని, ఆఫర్లు కూడా చేజారిపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తనలా నేను మాట్లాడలేను, కానీ ఆమెపై నాకు ప్రేమ ఉందని.. పైన మేమిద్దరం గొడవ పడినా , కింద అమ్మానాన్నలకి తెలియనిచ్చేవారం కాదన్నారు. ఇష్టమైన వాళ్లని ఒక మాట అనాలంటే కష్టమని తన మాజీ భార్యపై తనకున్న ప్రేమను బయటపెట్టారు నోయెల్. పెళ్లి అనేది ఎంతో అందమైనదని.. మన ముందు జనరేషన్స్‌లో భార్య కోసం భర్త, భర్త కోసం భార్య నిలబడేవాళ్లని తనకూ అలాంటి బంధమే కావాలని నోయెల్ చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై ఎస్తర్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











