For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సోనూ సూద్‌‌ స్పూర్తితో బండ్ల గణేష్.. కిడ్నీ అమ్ముకోవడానికి సిద్దమైన వ్యక్తి కోసం..

    |

    నటుడిగా నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బండ్లగణేష్ ఈ మధ్య కాలంలో ఓ చిన్న సైజ్ సోనూ సూద్ లా మారినట్లు అనిపిస్తోంది. అడిగిన వాటికి అడగని వారికి కూడా సహాయం అందించడానికి ముందుకు వస్తున్నారు. ఒకప్పుడు నటుడిగా నిర్మాతగా బిజీగా ఉన్న బండ్ల గణేష్ ఆ తరువాత వివిధ అంశాలపై స్పందిస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు.

     సినిమాలకంటే ఆ విషయాలతోనే..

    సినిమాలకంటే ఆ విషయాలతోనే..

    బండ్ల గణేష్ సినిమాలకంటే ఒక విధంగా వేరే విషయాలతోనే ఎక్కువగా బిజీ అవుతున్నాడు. ఆ మధ్య రాజకీయాలతో బిజీ అయిన ఈ సీనియర్ నటుడు హరీష్ శంకర్ వివాదంతో కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక కరోనా వైరస్ భారిన పడి వెంటనే కోలుకున్న గణేష్ ఇప్పుడు సహాయలు కూడా అందిస్తున్నాడు.

    బండ్ల గణేష్ సహాయం..

    బండ్ల గణేష్ సహాయం..

    ఇటీవల సోషల్ మీడియాలో ఆర్థిక ఇబ్బందులకు తట్టుకోలేకపోతున్నాను అంటూ కిడ్నీ అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ట్వీట్ చేయడంతో బండ్ల గణేష్ వెంటనే స్పందించారు. తప్పకుండా తనవైపు నుంచి సహాయం అందేలా చేస్తానని వివరణ ఇచ్చారు.

    కిడ్నీ డొనేట్ చేయడానికి సిద్దమైన వ్యక్తి..

    కిడ్నీ డొనేట్ చేయడానికి సిద్దమైన వ్యక్తి..

    వివరాల్లోకి వెళితే.. భాస్కర్ అనే నెటిజన్ బండ్ల గణేష్ కి ఈ విధంగా ట్వీట్ చేశాడు.. హాయ్ సార్. ఎవరికైనా కిడ్నీ కావాలంటే చెప్పండి. నేను డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే నా ఫ్యామిలిని పోషించడానికి నాకు ఇప్పుడు డబ్బు చాలా అవసరం. ఇంతకుముందు నేను బజాజ్ ఫైనాన్స్ లో పని చేశాను. ఇంటర్నల్ ఇష్యుస్ కారణంగా జాబ్ పోయింది. నాకు ఇప్పుడు 2 లక్షలు కావాలి. ప్లీజ్ హెల్ప్ చేయండి సర్ అని భాస్కర్ అనే నెటిజన్ వివరించాడు.

     తప్పకుండా ఉద్యోగం ఇప్పిస్తా..

    తప్పకుండా ఉద్యోగం ఇప్పిస్తా..

    వెంటనే స్పందించిన బండ్ల గణేష్.. బ్రదర్ మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ పంపండి తప్పకుండా మీకు ఉద్యోగం ఇప్పించి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని బండ్ల గణేష్ వివరణ ఇచ్చారు అందుకు సంబంధించిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

    Green India Challenge : Director Srinu Vaitla Takes Up Green India-Challenge & Nominated Sonu Sood
    మినీ సోనూ సూద్ లా బండ్లన్న

    మినీ సోనూ సూద్ లా బండ్లన్న

    ఇక అంతుకుముందు బండ్ల గణేష్ కరోనా వచ్చిన రిపోర్టర్ కి కూడా సాయం అడిగిన వెంటనే ఆన్ లైన్ లోనే డబ్బులు సెండ్ చేశాడు. డబ్బులు లేవు కష్టంగా ఉందని చెప్పడంతో బండ్ల గణేష్ ఫోన్ ఫే ద్వారా 2500రూపాయలు పంపించారు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. బండ్ల గణేష్ చేస్తున్న సహాయలకు ఓ వర్గం నెటీజన్స్ ఫిదా అవుతూ మినీ సోనూ సూద్ అనే ట్యాగ్ ఇస్తున్నారు.

    English summary
    Bandlaganesh, who has made a name for himself as an actor and producer, seems to have become a small size Sonu Sood in recent times. They are coming forward to offer help even to those who do not ask what is asked. Bandla Ganesh, who was once busy as an actor and producer, has since become a hot topic in response to various topics.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X