twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆక్సీమీటర్ ఎప్పుడు ఉపయోగించాలి? ఆక్సీజన్ లెవెల్స్ ఎలా చెక్ చేసుకోవాలి.. యాక్టర్ భద్రం జబర్దస్త్ చిట్కా!

    |

    యాక్టర్ భద్రం మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ అంటే సందేహమే అక్కర్లేదు. ఆయన డాక్టర్‌గా, మెటివేటివేషనల్ స్పీకర్‌గా, వెల్‌నెస్ ట్రైనర్‌గా, యోగా, స్ట్రెస్ థెరపిస్ట్‌గా ఎంతో మందికి ఉపశమనాన్ని కలిగిస్తుంటారు. నటనతో హాస్యం పంచుతూ ఆరోగ్యాన్ని పెంచుతున్న ప్రతిభావంతుడైన భద్రం కరోనావైరస్ సమయంలో ప్రజల్లో ఉండే అపోహలను పోగొట్టే ప్రయత్నాలను చేస్తున్నారు. కరోనావైరస్ కారణంగా అనేక భయాందోళనలతో ఉండే వారికి నాలుగు మంచి మాటలతో ఉపశమనం కలిగిస్తున్నారు. గత కొద్ది నెలలుగా అనేక వీడియోలతో ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా ఆక్సీమీటర్, థర్మామీటర్ వినియోగంపై చక్కటి వీడియోను రిలీజ్ చేశారు.

    ఇటీవల కాలంలో కరోనావైరస్ అందర్నీ ఆందోళనకు గురిచేస్తుండటంతో ప్రతీ ఒక్కరి ఇంట్లో ఆక్సీమీటర్, థర్మామీటర్ ఉండటం సర్వసాధారణంగా మారింది. చాలా మంది తమలోని అనుమానంతో ఆక్సిజన్ లెవెల్స్, శరీర ఉష్ణోగ్రతలను చూసుకోవడంలో అతి జాగ్రత్తను పాటిస్తూ ఇబ్బందులను కొని తెచ్చుకొంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో డాక్టర్, సినీ యాక్టర్ భద్రం వీడియోను రిలీజ్ చేసి కొన్ని జాగ్రత్తలు, చిట్కాలు చెప్పారు.

    Actor Bhadram gives best tips for Oximeter and Oxygen levels check

    భద్రం వీడియోలో మాట్లాడుతూ... మెడకు చేతులు పెట్టుకొంటూ పదే పదే టెంపరేచర్ చెక్ చేసుకోవడం, ముఖాన్ని అటు ఇటూ కదుపుతూ వాసన ఉందా లేదా అంటూ ముక్కుతో గాలిని పీల్చుకోవడం, అలాగే చేతికి ఆక్సీమీటర్‌ తొడుక్కొని ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకోవడం అలవాటుగా మారింది. అయితే అలా చెక్ చేసుకోవద్దని ఆయన సలహా ఇచ్చారు. రోజుకు నాలుగు సార్లు ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకోమంటే.. ప్రతీ గంటకు నాలుగు సార్లు చెక్ చేసుకొనే వాళ్లు ఉన్నారు. కొందరైతే అర్ధరాత్రి లేచి ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకొంటున్నారు. బాత్రూం కూడా ఆక్సీ మీటర్ తీసుకెళ్లాల్సిన పని లేదంటూ సెటైర్ కూడా వేశారు.

    కొందరు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయనే అనవసరపు ఆందోళన వల్ల తమ ఆక్సీజన్ లెవెల్స్ పడిపోవడానికి వారే కారణం అవుతున్నారు. అనవసరంగా ఆందోళన వల్ల దాని వల్ల శ్వాస సంబంధ సమస్యలు ఏర్పడి ఆక్సీజన్ లెవెల్స్ పడిపోతాయి. కాబట్టి అనవసరంగా ఆందోళనకు గురై ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దు అంటూ యాక్టర్ భద్రం సలహా ఇచ్చారు.

    ఇక నటన విషయానికి వస్తే ఇటీవల బట్టల రామస్వామి బయోపిక్కు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంలో మంచి పాత్రతో వినోదాన్ని పంచారు. జీ5 ఓటీటీలో రిలీజైన చిత్రం ప్రేక్షకులను, విమర్శకుల ప్రశంసలు అందుకొంటున్నది.

    English summary
    Actor Bhadram doing good job at Corona times as a doctor. He has been giving suggestion as wellness trainer. He recenly released a video and gives best tips for Oximeter and Oxygen levels check.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X