ఎన్టీఆర్ అల్లుళ్ళు ఫిక్స్ అయ్యారు.. చంద్రబాబుగా రానా, దగ్గుబాటి ఎవరంటే!
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటించే నటీనటులు క్రమంగా పెరుగుతున్నారు. ఎన్టీఆర్ జీవితం సినిమా, రాజకీయాల్లో చాలా మంది ప్రముఖులతో ముడిపడి ఉంది. ఆయా పాత్రలకు తగ్గ నటీనటుల్ని ఎంపిక చేసుకోవడంలో దర్శకుడు క్రిష్ తలమునకలై ఉన్నాడు.
చంద్రబాబు పాత్ర కోసం స్టార్ హీరో రానా ఎంపికైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో చంద్రబాబు పాత్ర ఎంత ఉందో అదే స్థాయిలో పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు పాత్ర కూడా ఉంది. ఈ పాత్రలో నటింపజేసేందుకు క్రిష్ సరైన నటుడికోసం ఎదురుచూస్తున్నాడు. తాజాగా దగ్గుబాటి పాత్ర కోసం నటుడు భరత్ రెడ్డిని ఎంపిక చేశారు.

భరత్ రెడ్డి పలు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ పోషిస్తూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దగ్గుబాటి వెంకటేశ్వర రావు పాత్రలో భరత్ సరిపోతాడని భావించిన క్రిష్ అతడిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.తన తండ్రి పాత్రలో బాలయ్య ఒదిగిపోయి ఉన్నాడు. సుమంత్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











