For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నటుడు బ్రహ్మాజీకి బంపర్ ఆఫర్.. లాటరీలో కోట్ల కొద్దీ డబ్బు.. కలెక్ట్ చేసుకోమని ట్వీట్!

  |

  ఎక్కడో తూర్పుగోదావరి జిల్లాలో పుట్టిన బ్రహ్మాజీ నటన మీద ఆసక్తితో చెన్నై వెళ్లి అక్కడ సినిమా రంగంలో అవకాశాలు దక్కించుకున్నారు. అలా 86లో వచ్చిన మన్నెంలో మొనగాడు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆయన చివరిగా రిలీజ్ అయిన ఏక్ మినీ కధ వరకు రకరకాల పాత్రలు పోషిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. అయితే బ్రహ్మాజీ కొన్ని వందల కోట్ల లాటరీ తగిలింది. దీనికి సంబంధించి ఆయన చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

  నటన మీద ఆసక్తి అలా

  నటన మీద ఆసక్తి అలా

  బ్రహ్మాజీ చదువుకునే రోజుల్లో ఆయన తండ్రి నెల్లూరులో తహసిల్దార్ గా పనిచేసేవారు. అదే సమయంలో శంకరాభరణం సినిమా సూపర్ హిట్ కావడంతో అప్పటికి డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న సోమయాజులు ఈ నెల్లూరు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు సత్కరించారు.

  అప్పుడే నిర్ణయం

  అప్పుడే నిర్ణయం

  తహశీల్దార్ కొడుకు కావడంతో, బ్రహ్మజీకి జె.వి.సోమయాజులు సన్మాన కార్యక్రమంలో దగ్గరగా చూసే అవకాశం వచ్చింది. తన తండ్రి సహోద్యోగులందరూ జె.వి.సోమయాజులు ఆశీర్వాదం పొందడానికి వేదికపై వరుసలో ఉండడం చూసి ఆ సమయంలో, బ్రహ్మజీ కూడా ఏదో ఒక రోజు సినిమాల్లో కూడా నటించి జెవి సోమయాజులు లాంటి గొప్ప నటుడిగా మారాలని నిర్ణయించుకున్నాడు.

  మద్రాస్ వెళ్లి

  మద్రాస్ వెళ్లి

  ఈ సంఘటన అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చివేసింది. అందుకే ఆయన ఇంటర్మీడియట్ తరువాత, ఆయన నటుడు కావాలని భావించి మద్రాస్ వెళ్ళాడు. అలా నటుడుగా మారిన ఆయన అనేక సినిమాల్లో కీలక పాత్రలలో నటించాడు. ఎక్కువగా ఆయన దర్శకుడు కృష్ణ వంశీ సినిమాల్లో కనిపిస్తూ ఉంటాడు.

  హీరోగా కూడా

  హీరోగా కూడా

  కృష్ణ వంశీ తొలి చిత్రం గులాబీలో బ్రహ్మజీ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించాడు. ఆ తరువాత కృష్ణ వంశీ రెండో సినిమా నిన్నే పెళ్ళాడతా అనే సినిమాలో కూడా కనిపించాడు. ఇక ఇద్దరూ క్లోజ్ కావడంతో ఆయన సింధూరం సినిమాతో హీరోగా మారారు. ఇక హీరోగా అవకాశాలు లేకపోవడంతో బ్రహ్మజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగారు. ఇక తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

  కోట్ల రూపాయల లాటరీ

  కోట్ల రూపాయల లాటరీ

  సాధారణంగా మన ఫోన్ లకు లాటరీ తగిలిందని మెసేజులు వస్తుంటాయి కదా. అలాగే బ్రహ్మాజీకి కూడా ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ లో మీ ఫోన్ నెంబర్ కి నాలుగు కోట్ల 65 లక్షల రూపాయల లాటరీ తగిలిందని యునైటెడ్ కింగ్డమ్ కి సంబంధించిన ల్యాండ్ రోవర్ కంపెనీ నుంచి మీకు ఈ నగదు లభిస్తోందని పేర్కొంటూ మెసేజ్ వచ్చింది.

  Nithin Birthday Celebrations With Rang De Movie Team | Venky Atluri, Keerthy Suresh
  మీరే తీసుకోండి అంటూ

  మీరే తీసుకోండి అంటూ

  ఇక అందుకోసం మీ పేరు, ఫోన్ నెంబర్, వయస్సు, అడ్రస్, వృత్తి లాంటి వివరాలతో ఒక మెయిల్ ఐడికి మెయిల్ చేయాలని పేర్కొన్నారు. ఈ వివరాలన్నింటినీ స్క్రీన్ షాట్ తీసిన బ్రహ్మాజీ వచ్చిన ఫోన్ నెంబర్ తో సహా ట్వీట్ పెట్టి హైదరాబాద్ పోలీస్, సైబరాబాద్ పోలీసులను ట్యాగ్ చేశాడు. సార్ నాకు నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది, దయచేసి ఆ డబ్బులు కలెక్ట్ చేసుకోగలరు అంటూ ఆయన ట్వీట్ చేయడంతో ఆ ట్వీట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది.

  English summary
  Tollywood famous actor brahmaji is very active in social media handles. Recently he tweeted a screenshot of fake lottery message received today, then he tag Hyderabad city police along with cyberabad police to take action on that number
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X