విశ్వక్ సేన్ ఎందుకు పెద్ద హీరో కాదు? క్లారిటీ ఇచ్చిన బ్రహ్మాజీ!
సీనియర్ నటుడు బ్రహ్మాజీ తెలుగు ప్రేక్షకులను వరుస చిత్రాలతో అలరిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు క్రిష్ణ వంశీ చిత్రాల్లో రెగ్యులర్ గా కనిపించే ఈయన 90వ చిత్రాల నుంచే ఆడియెన్స్ ను అలరిస్తూ వస్తున్నారు. 'సింధూరం' చిత్రంతో హీరోగానూ పరిచయం అయ్యారు. ఆ తర్వాత విభిన్న పాత్రలు పోషిస్తూ 200 వరకు సినిమాలు చేశారు. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలకు ప్రాణం పోస్తూ ఆకట్టుకుంటున్నారు. సపోర్టింగ్ రోల్స్ తో సినిమాకు మరింత బలాన్ని చేకూరుతున్నారు. కామెడీ, విలన్, పోలీస్, ఆఫీసర్స్ లాంటి పాత్రల్లో ఎక్కువగా కనిపించి అలరించారు. ఇప్పటికీ వరుస పెట్టి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక తాను నటించిన 'బాపు' చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా సినిమాకు పెద్ద హీరోలతో ప్రమోట్ చేయొచ్చు కదా? అనే ప్రశ్నకు షాక్ అయ్యారు. ఏంటీ విశ్వక్ సేన్ పెద్ద హీరో కాదా.. ఆయన వయస్సుల్లో పెద్ద హీరో కాకపోవచ్చు కానీ.. ఇఫ్పుడున్న యూత్ ట్రెండ్ హీరో విశ్వక్ సేన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన నా 'బాపు' సినిమా ప్రమోషన్ కు సహకరించారు. ఇక ఇండస్ట్రీలోని సీనియర్ హీరోలను చిటికిమాటికి పిలవడం కష్టమైన పనే. వాళ్లు రావాల్సిన సమయంలో వచ్చి సహకరిస్తూనే ఉన్నారని బదులిచ్చారు.

విశ్వక్ సేన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉన్నారు. ఎందుకంటే.. ఆయన నటించిన 'లైలా' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా సాధ్యమైనంత వరకు ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. సినిమాను ఆడియెన్స్ మైండ్ కు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే విశ్వక్ సేన్ లేడీ గెటప్ పై చర్చ జరుగుతోంది. అందరిచూపు విశ్వక్ లైలా పాత్రలో ఎలా నటించారనే దానిపైనే ఉంది. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ లోనూ 'లైలా' సినిమాపై ఆసక్తి క్రియేట్ చేసేలా విశ్వక్ సేన్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇక తన సినిమా పనులున్నా.. చిన్న చిన్న సినిమాల ప్రమోషన్స్ కూ టైమ్ కేటాయిస్తుంటారు.
ఏడాదికి ఎలాగైనా విశ్వక్ మూడు సినిమాలను థియేటర్లలో దింపుతూ వస్తున్నారు. ఆడియెన్స్ కు బ్యాక్ టు బ్యాక్ కిక్ అందించే విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు... అలనాటి హీరోలు వరుస పెట్టి సినిమాలు ఎలా చేశారో అదే పంథాలో దూసుకెళ్తున్నారు. ఈక్రమంలో ఆయన సినిమాలకు మాత్రం పెద్ద హీరోల మాదిరిగానే కష్టపడుతున్నారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక బ్రహ్మాజీ నటించిన 'బాపు' చిత్రం టీజర్ ను నేషనల్ క్రష్ రష్మిక మందన్న లాంచ్ చేసిందన్నారు. అడగ్గానే ఒప్పుకొని తప్పకుండా రిలీజ్ చేస్తానని చెప్పడం సంతోషంగా ఉందన్నారు. చివరిగా బ్రహ్మాజీ 'టిల్లు స్క్వేర్', గుంటూరు కారం, పుష్ప2 : ది రూల్... చిత్రాలతో అలరించారు. తెలుగు సినిమాలే కాకుండా తమిళంలోనూ అవకాశాలు అందుకుంటున్నారు. అక్కడ 'ది వారియర్'లో ముఖ్య పాత్ర పోషించి ఆకట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











