టాలీవుడ్ చిత్రాల్లో మనోళ్లను తీసుకోరు.. రీజన్ ఇదే.. బ్రహ్మాజీ ఆసక్తికర వ్యాఖ్యలు!
సీనియర్ నటుడు బ్రహ్మాజీ ప్రస్తుతం 'బాపు' చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఆయన గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. వరుస చిత్రాలతో ఆయన ఆడియెన్స్ ను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఈయన 90లో దర్శకుడు క్రిష్ణ వంశీ డైరెక్టర్ చేసిన చిత్రాల్లో రెగ్యులర్ గా కనిపించే వారు. నటుడిగా తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న బ్రహ్మాజీ తెలుగు ఇండస్ట్రీలో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఢిపరెంట్ రోల్స్ లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. కామెడీ పాత్రలో పాటు.. కీలక పాత్రల్లోనూ కనిపిస్తూ ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేస్తున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆరిస్ట్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే వస్తున్నారు.
రీసెంట్ గా బ్రహ్మాజీ 'టిల్లు స్క్వేర్'.. గుంటూరు కారం, పుష్ప2 వంటి చిత్రాలతో అలరించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈయన 'బాపు' సినిమాలో నటించారు. ఆయనే ప్రధాన పాత్రను పోషించడం విశేషం. ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా బ్రహ్మాజీ ఆ సినిమాను ప్రమోట్ చేసేందుకు పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆసక్తికర వ్యాఖ్యలతో ఆడియెన్స్ దృష్టిని తనవైపు తిప్పుకుంటున్నారు. కాగా.. తాజాగా సెన్సేషనల్ వార్తలపై స్పందించారు. ఎప్పటి నుంచో తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వారికే చోటు దక్కడం లేదంటూ వార్తలు కొన్ని ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. కానీ కొన్నాళ్లుగా ఆ పంథా మారిందని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం తెలుగు టాలెంట్ ను పెద్ద ప్రాజెక్ట్స్ కు తీసుకోవడం లేదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

ఈ క్రమంలో తాజాగా... బ్రహ్మాజీ కూడా స్పందించారు. 'తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో భారీ చిత్రాలు నిర్మితమవుతున్నా.. మన తెలుగు వారికి సరైన అవకాశాలు రావడం లేదని, కొత్త వారిని ఎంపికచేయడంలో తేడాలున్నాయా?' అంటూ ఇంటర్వ్యూయర్ అడిగి ప్రశ్నకు ఆసక్తికరంగా బదులిచ్చారు... ప్రస్తుతం టాలీవుడ్ లో అలాంటి కొలమాణం లేదన్నారు. ఏదేని సినిమాకు కాస్టింగ్ అనేది దర్శకనిర్మాతల నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. వారు ఎలాంటి సినిమా తీయబోతున్నారు.. జోనర్ ఏంటీ.. బడ్జెట్ ఏంటే అంశాలను పరిగణలోకి తీసుకొని కాస్ట్ అండ్ క్రూను ఎంపిక చేస్తారని తెలిపారు.
ఇక పెద్ద ప్రాజెక్ట్స్ అయినా.. ఎస్ఎస్ రాజమౌళి 'బాహుబలి'లో సత్యరాజ్ మినహా ప్రధాన పాత్రలో నటించిన వారందరూ తెలుగువాళ్లే నని బదులిచ్చారు. అలాగే ప్రశాంత్ నీల్ 'సలార్', 'కేజీఎఫ్'లోనూ వాళ్ల కన్నడ నటులనే ఎంపిక చేశారు కదా? అని సమాధానం ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక పుష్పలోనూ ఆ ప్రాజెక్ట్ కు ఫహద్ ఫాజిల్ అవసరం కాబట్టి ఆయన్ని తీసుకొచ్చారు. ఇక లోకల్ యాక్టర్స్ కు మాత్రమే అవకాశం ఇవ్వాలనే అంశాన్ని నేనే సమ్మతిస్తాను. కానీ దర్శకుడు, రైటర్ రాసుకున్న కథలకు అనుగుణంగా మనవాళ్లు సెట్ అవకపోతే అక్కడి నుంచి తెచ్చుకోవడం పెద్దగా తప్పుపట్టకూడదని చెప్పుకొచ్చారు. ఇక ఆయన నెక్ట్స్ చిరంజీవి 'విశ్వంభర'లోనూ కనిపించబోతున్నారని తెలిపారు. మరో ఐదారు ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తున్నారని చెప్పారు.


Click it and Unblock the Notifications











