Actor Brahmaji: నవీన్ పొలిశెట్టి టాలెంట్ చూస్తుంటే భయమేస్తోంది, నేను రిటైర్ అయిపోతా ఇక: బ్రహ్మాజీ

Actor Brahmaji: యంగ్ అండ్ డైనమిక్ హీరో నవీన్ పోలిశెట్టి యాక్టింగ్, కామెడీ టైమింగ్ కు సినీ నటులు అంతా ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాలో స్వీటీకి జోడీగా నటించిన నవీన్ పొలిశెట్టికి మంచి మార్కులే పడుతున్నాయి. నవీన్ ను చాలా మంది పొగడ్తలతో ముంచెత్తుతుండగా.. తాజాగా నటుడు, కమెడియన్ బ్రహ్మాజీ కూడా స్పందించారు. నవీన్ టాలెంట్ చూస్తుంటే తనకు చాలా భయమేస్తుందని... ఇక తాను రిటైర్ మెంట్ తీసుకోవడం బెటర్ అంటూ సరదాగా ట్వీట్ చేశారు.

అంతేకాకుండా ఓ నెటిజెన్ మిస్ పొలిశెట్టి, మిస్టర్ పొలిశెట్టి సినిమాలో నవీన్.. స్వీటీతో చెబుతున్న ఓ డైలాగ్ ను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఇంజినీరింగ్ కష్టాలను ఉద్దేశించి గతంలో ఓ హిందీ సినిమాలో ఆయన చెప్పిన మరో డైలాగ్ ను ఉపయోగించి ఓ నెటిజెన్ క్రియేట్ చేశాడు. సౌత్ లేదా నార్త్.. ఏ ప్రాంతమైనా నవీన్ పొలిశెట్టి ఇంజినీర్స్ వాయిస్ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై హీరో నవీన్ పొలిశెట్టి ఆనందం వ్యక్తం చేశారు. ఈ వీడియో చూసిన బ్రహ్మాజీ చాలా ఫన్నీగా స్పందించారు. ఇంజినీరింగ్ విద్యార్థిగా నవీన్ తల్లిదండ్రులపై ఫ్రస్టేట్ అయ్యే నటన చూసి తెగ సంబర పడిపోయారు.

Actor Brahmaji Sensational Comments on Hero Naveen Polishetty

రీల్ లైఫ్ లోనే కాదండోయ్.. రియల్ లైఫ్ లోనూ నవీన్ పొలిశెట్టి ఇంజినీరింగ్ విద్యార్థే. అయితే సినిమాలపై ఉన్న ఇష్టంతో నటుడు కావాలని ఎంతగానో ప్రయత్నాలు చేశాడు. చిన్నా, చితక పాత్రల కోసం కూడా విపరీతంగా తిరిగాడు. ముఖ్యంగా ముంబయి వెళ్లి ఎన్నెన్నో ఆడిషన్లు ఇచ్చాడు. కెరియర్ ప్రారంభించిన తొలి రోజుల్లో డబ్బులు లేక నవీన్ పొలిశెట్టి అనేక ఇబ్బందులు పడ్డారు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, 1 నేనొక్కడినే వంటి సినిమాల్లో సహాయ నటుడిగా కనిపించారు. కానీ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత వచ్చిన జాతి రత్నాలు సినిమా అయితే ఊహించని రీతిలో హిట్టు కాగా నవీన్ పొలిశెట్టి గ్రాఫే మారిపోయింది.

Actor Brahmaji Sensational Comments on Hero Naveen Polishetty

ఇటీవల విడుదల అయిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాపై ప్రారంభంలో పెద్దగా అంచనాలు లేవు. కానీ రిలీజ్ డేట్ లో మార్పులు, టీజర్, ట్రైలర్ లు కూడా పెద్దగా బజ్ ను క్రియేట్ చేయలేకపోయాయి. ఇవన్నీ పక్కన పెడితే ఏకంగా షారుఖ్ సినిమాతో పోటీగా దిగడం వంటివి.. ఇవన్నీ చూస్తే మిస్ శెట్టి సినిమా చుట్టూ నెగటివ్ వైబ్ కనిపించింది. కానీ రిలీజ్ అయిన సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మిస్ శెట్టి కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకుంది. ఇక ఓవర్సీస్ లో ఫస్ట్ వీకెండ్ ముగిసేలోపే డాలర్ మార్కును అందుకొని సంచలనం సృష్టించింది.

Actor Brahmaji Sensational Comments on Hero Naveen Polishetty

ఇప్పటికీ ఈ సినిమాకు మంచి కలెక్షన్లే వస్తున్నాయి. అయితే ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో గత అక్టోబర్ నాలుగో తేదీ అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి యాక్టింగ్ నిజంగానే అదిరింది. ఆయన చేసే స్టాండప్ కామెడీ అందరిలోనూ నవ్వులు పూయిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X