బ్రహ్మానందానికి పోయేది ఏముంది.. ఆయనకి సినిమాలే అక్కర్లేదు!
టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ తెలుగు ప్రేక్షకులకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలో అలరిస్తున్నారు. కామెడీ, కామోడీ విలన్ గానూ పాత్రలు పోషిస్తూ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సీనియర్ నటుడిగా ఇండస్ట్రీలో మరిన్ని చిత్రాల్లో నటిస్తూనే ఉన్నారు. దర్శకుడు కృష్ణ వంశీ చిత్రాల్లో రెగ్యులర్ గా కనిపించే వారు. 90ల చిత్రాల నుంచే ఆడియెన్స్ ను అలరిస్తూ వస్తున్నారు బ్రహ్మాజీ. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇక పోతే 'సింధూరం' చిత్రంతో హీరోగానూ పరిచయం అయ్యారు. ఆ తర్వాత విభిన్న పాత్రలు పోషిస్తూ 200 వరకు సినిమాలు చేశారు.
ఇక తాజాగా ఆయన ముఖ్య పాత్రతో 'బాపు' అనే చిత్రం రూపుదిద్దుకుంది. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు మద్దతిస్తూ యంగ్ హీరో మాస్ కా దాస్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న టీజర్ విడుదల చేశారు. తమ బెస్ట్ విషెస్ ను తెలియజేశారు. అయితే... బ్రహ్మాజీ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూనే వస్తున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇండస్ట్రీలోని పలు అంశాలపై ఇంట్రెస్టింగ్ గా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా లెజెండరీ నటుడు బ్రహ్మానందం గురించి ఇలా మాట్లాడారు.

ఇటీవల బ్రహ్మానందం సెలెక్టెడ్ చిత్రాల్లో నటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఏడాదిలో ఒకటి రెండు కంటే ఎక్కువగా కనిపించడం లేదు. ఇదే తరహాను బ్రహ్మాజీ కూడా ఫాలో అవుతున్నారా? అనే ప్రశ్నకు ఇలా స్పందించారు... బ్రహ్మానందానికి ఇండస్ట్రీలోని ఏ నటుడికి పోలికి అస్సలు ఉండదు. ఆయన 1500 సినిమాల్లో నటించారు. వెల్ సెటిల్డ్. బాగా సంపాదించాడు. ఆయకు పోయేది ఏమీ లేదు కాబట్టి అలా చెబుతుంటారు. ఆయన మహానుభావుడు. కోట్లు సంపాదించాడు. ఆయనకు సినిమాలు అవసరమే లేదు. ఇండస్ట్రీలో ఆయన చేయని పాత్రలేదు. ఆయన కామెడీలో మేం పదిశాతం చేస్తేనే పాత్రలు పండిపోతున్నాయి.
బ్రహ్మానందం కాలక్షేపానికి మాత్రమే సినిమాలు చేస్తున్నారు. ఆయన్ని ఎవరూ ఫాలో కాలేరు. ఇక ఇఫ్పుడు మేమంతా బ్రహ్మానందం నటించిన చిత్రాల్లో సగం కూడా లేము. ఆయనతో ఎవరినీ పోల్చకండి.. అంటూ బదులిచ్చారు. ఇక బ్రహ్మానందం రీసెంట్ గా కొడుకు రాజా గౌతమ్ తో కలిసి నటించిన చిత్రం 'బ్రహా ఆనందం'తో వెండితెరపై మెరిశారు. ఫిబ్రవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక సినిమా టాక్ ఓ మాదిరిగానే ఉంది. బ్రహ్మానందం తన కొడుకుతో కలిసి బిగ్ స్క్రీన్ షేర్ చేసుకోవడం మూలంగా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇక బ్రహ్మానందం అంతకు ముందు 'రంగమార్తాండ' చిత్రంతో ప్రేక్షకుల హృదయాలను కదిలించారు. ఆయన కమెడియనే కాదు... అసలైన నటుడు అని మరోమారు చూపించారు. ఆ చిత్రంలోని ఎమోషనల్ సీన్స్ లో అందరి చేత కంటతడి పెట్టించాడు. ఇక బ్రహ్మాజీ విషయానికొస్తే.. ప్రస్తుతం ఇండస్ట్రీలో అరడజన్ కు పైగా సినిమాల్లోనే నటిస్తూ బిజీగా ఉన్నారు. అందులో చిరంజీవి 'విశంభర', వీడీ12 ఉన్నాయి.


Click it and Unblock the Notifications











