twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'జగన్ గారూ'.. ప్లీజ్ టేక్ యాక్షన్ సార్...బ్రహ్మాజీ రిక్వెస్ట్!

    |

    ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. రోజురోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతూ ఉండడమే కాక మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగి పోతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా పయనిస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించగా ఆంధ్రప్రదేశ్ లో మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను సీనియర్ నటుడు బ్రహ్మాజీ ఒక రిక్వెస్ట్ చేశారు. అసలు విషయం ఏమిటంటే నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా పరిస్థితుల మీద సమీక్ష సమావేశం నిర్వహించారు.

    ఈ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా కోసం కొన్ని ప్రత్యేక ఆస్పత్రులను సిద్ధం చేసిందని చెప్పుకొచ్చారు.. ఇవి కాక ఆరోగ్య శ్రీ కింద చికిత్స అందిస్తున్న హాస్పిటల్స్ సైతం కరోనా కోసం ఉచితంగా వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. ఇవి కాకుండా వేరే ఇతర ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా కరోనా ట్రీట్మెంట్ అందిస్తే దానికి ఒక రేట్ కార్డ్ ఫిక్స్ చేశామని ఆ రేట్ కార్డ్ వరకు చార్జీలు వసూలు చేస్తూ హాస్పిటల్స్ సేవా దృక్పథంతో ముందుకు వెళ్లాలని కోరారు.. ఒకవేళ ఏదైనా హాస్పిటల్ రేట్ కార్డ్ ని మించి డబ్బు వసూలు చేస్తూ ప్రజలను దోపిడీకి గురి చేస్తూ ఉంటే కచ్చితంగా హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశించారు..

    Actor Brahmaji urges jagan to take action on private hospitals

    అప్పటికప్పుడు హాస్పిటల్ అనుమతులు రద్దు చేసి హాస్పిటల్స్ ని సీజ్ చేయడానికి కూడా వెనుకాడడం వద్దని జగన్ ఆదేశించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ గా మారింది. ఈ వీడియోను షేర్ చేసిన నటుడు బ్రహ్మాజీ ఆల్రెడీ దోపిడీ మొదలు అయింది, దయచేసి యాక్షన్ తీసుకోండి అంటూ ముఖ్యమంత్రి జగన్ ను కోరారు. ఇక సినిమాల విషయానికి వస్తే బ్రహ్మాజీ పవన్ కళ్యాణ్ - రానా ప్రధాన పాత్రలలో రూపొందుతున్న అయ్యప్పనుమ్ కోషియం సినిమా రీమక్ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

    English summary
    Andhrapradesh CM YS Jagan Mohan Reddy directed officials to take severe action on private hospitals exploitation. quoting this statement actor brahmaji took twitter and asked to take action on those hospitals because they started exploitation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X