నేను రేప్ చేసిన వాళ్లందరూ టాప్ హీరోయిన్స్ అయ్యారు
నటుడు చలపతిరావు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆనాటి సీనియర్ ఎన్టీఆర్ నుండి నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకు మూడు తరాల నటులతో నటించి మెప్పించారు. సినిమాలపై అభిమానంతో ఆయన ఇంట్లో చెప్పకుండా మద్రాస్ కి వచ్చేశారు. సీనియర్ ఎన్టీఆర్ ప్రోత్సాహంతో సినిమాల్లోకి అడుగు పెట్టారు. వాస్తవానికి హీరోగా నటించాలని భావించినా.. ఇండస్ట్రీలో అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ ,శోభన్ బాబు వంటి సీనియర్ నటులు ఉండడంతో ఆయనకు సరైన అవకాశాలు రాలేదు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు.
తెలుగు చిత్ర సీమలో క్యారెక్టర్ ఆర్టిస్టు నటుడు చలపతిరావుకు ప్రత్యేక స్థానం ఉంది. చలపతి రావు తనకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన విభిన్న పాత్రలలో నటించినా విలన్ వేషాలకి ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఆయన తన సినీ జీవితంలో దాదాపు 1200 సినిమాల్లో నటించారు. అందులో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా వివిధ రకాల పాత్రలను పోషించారు. 1969లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన కథానాయకుడు సినిమాతో ఆయన వెండితెరపై కనిపించారు. దాదాపు ఐదు దశాబ్దాలు సాగినా ఆయన నట జీవితంలో ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారు. అయితే. ఆయన లేడీ క్యారెక్టర్ లను రేప్ లు చేయడంతో రేపుల చలపతిరావు అనే పేరు కూడా వచ్చేసింది.

తన నట జీవితంలో ఎన్టీఆర్ తీసిన 'దానవీరశూరకర్ణ' సినిమా టర్నింగ్ పాయింట్ అని చలపతిరావు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే హీరో కృష్ణ 'కురుక్షేత్'రం అనే సినిమాను మొదలు పెట్టాడు. ఆ సినిమా షూటింగ్ కోసం మెయిన్ ఆర్టిస్టులందరినీ రాజస్థాన్ కు తీసుకెళ్లారు. దీంతో దానవీరశూరకర్ణ సినిమాకు యాక్టర్స్ కొరత ఏర్పడింది. ఆ సమయంలో ఎన్టీఆర్ గారు తన టాలెంట్ ను గుర్తించి ఒకటి కాదు.. రెండు కాదు. ఆ సినిమాలో ఐదు పాత్రలలో నటించే దానికి అవకాశం కల్పించాలని తెలిపారు. దీంతో తన పేరులో మారుమోగింది.
తాజాగా చలపతి రావు ఓ పాత వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అందులో చలపతి రావు మాట్లాడుతూ.. తాను ఎక్కువగా విలన్ వేశాలనే వేశాను. ప్రతి సినిమాలో మూడు, నాలుగు రేపు సీన్స్ ఉండేవని తెలిపారు. దీంతో తనని రేపుల చలపతిరావు అని పిలిచేవారని చెప్పుకొచ్చారు. తన నట జీవితంలో 94 రేప్ సీన్లలో నటించాలని, మిగతా 6 కూడా పూర్తిచేసే 100 చెయ్యాలని భావించాను. కానీ, అవకాశం రాలేదని చెప్పారు. అయితే.. తాను రేప్ చేసిన హీరోయిన్లందరూ టాప్ పొజిషన్ కు వెళ్లారని ఆ సెంటిమెంట్ ఉందన్నారు.

అందులో శ్రీదేవి, జయప్రద వంటి స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఒక దశలో హీరోయిన్లు తనను చూసి భయపడే వారిని, తనతో మాట్లాడ్డానికి కూడా జంకే వారని చలపతి రావు అన్నారు. తాను తాగుతాననీ, అమ్మాయిలతో తిరుగుతున్నానని, రేపులు చేస్తున్నానని అనుకునేవారని, కానీ, తన భార్యకు ఇచ్చిన మాట ప్రకారం సిగరెట్లు, మందు, అమ్మాయిలకు చాలా దూరంగా ఉండేవాడినని చలపతి రావు తెలిపారు. పైగా సీనియర్ ఎన్టీఆర్ తో తన సహవాసం చేయడం వల్ల అన్నగారిగా అలవాట్లు తన కూడా వచ్చాయని, ఆయన వల్లనే తనకు డిస్ప్లే గా ఉండడం అలవాటైందని చెప్పుకొచ్చారు సీనియర్ నటడు చలపతి రావు. చలపతిరావు కుమారుడు రవిబాబు తండ్రి బాటలోనే నడుస్తున్నారు. రవి బాబు కూడా నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా సత్తా చాటుతున్నారు. 2022లో చలపతిరావు అనారోగ్యం కారణంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











