ఎన్టీఆర్ యుగ పురుషుడు.. ఆయన మాటల వల్లే ఈ స్థాయికి.. చంద్రమోహన్ ఎమోషనల్

ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ మెమోరియల్‌ అవార్డ్స్‌ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీనియర్‌ నటుడు కోటా శ్రీనివాసరావు, చంద్రమోహన్‌, ప్రభ,శివకృష్ణ,రోజారమని,కవిత,తనికెళ్లభరణి, బాబుమోహన్‌,కైకాల నాగేశ్వరరావు,బుర్రా సాయిమాధవ్,కొమ్మినేని వెంకటేశ్వరరావు, గుబ్బాసురేష్ కుమార్ తదితరులను ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ గారపాటి లోకేశ్వరి, నందమూరి మోహనకృష్ణ, నందమూరి చైతన్యకృష్ణ, గారపాటి శ్రీనివాస్, నందమూరి యశ్వంత్, రిటైర్డ్ ఐ జి మాగంటి కాంతారావు, అంబికా కృష్ణ, తుమ్మల ప్రసన్నకుమార్, అనంతపురం జగన్,'మా' ఈ సీ మెంబర్స్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో చంద్రమోహన్ మాట్లాడుతూ..

నాకు ఈ రోజు అద్బుతమైన అనుభూతి కలుగుతున్నది. ఆ మహానుభావుడు పేరిట పెట్టిన అవార్డును రామారావు కుటుంబ సభ్యులతో అందుకోవడమనే కలలో కూడా ఊహించలేదు. ఈ అవార్డు పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్ కంటే ఎక్కువ. ఎందుకంటే.. నేను నటుడిని. ఒక నటుడి పేరు మీద ఇచ్చే పురస్కారాన్ని అందుకోవడం చాలా అరుదు అని చంద్రమోహన్ అన్నారు.

నేను ఎక్కువ సినిమాలు ఎన్టీఆర్‌తో నటించలేదు. నాకు ఎక్కువ జానపదం, పౌరాణికం చిత్రాల్లో నటించడం నాతో కాదు. అందుకే ఆయనతో ఎక్కువగా నటించలేదు. కానీ ఏఎన్నాఆర్‌తో నటించే అవకాశం లభించింది. అన్నిటికంటే ముఖ్యంగా నేను నటన అరంగేట్రం చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ నాపై క్లాప్ కొట్టారు. బీఎన్‌రెడ్డితో వచ్చి నా తొలి షాట్‌కు రామారావు ఉండటం నాకు గొప్ప వరం అని అన్నారు.

నాపై క్లాప్ కొట్టిన తర్వాత ఆయన నాతో మాట్లాడుతూ.. బ్రదర్.. వాహిని, విజయ సంస్థలో ఆస్థాన విద్వాంసులం. నెల జీతానికి పనిచేశాం. పాతాళభైరవి నుంచి వారితో నేను పనిచేస్తున్నాను. మీకు కూడా అలాంటి అవకాశం దక్కింది. మీరు కూడా పైకి రావాలి. సినిమాల్లోకి అందరూ వస్తారు. కానీ క్రమశిక్షణ, క్యారెక్టర్ ముఖ్యమని చెప్పారు.

Actor Chandra Mohan emotional speech after getting NTR Memorial Award in Hyderabad

ఆయన మాటలు విని అలానే బిహేవ్ చేశాను. ఇంతటి పాపులారిటి లభించింది. ఈ రోజు మీ ముందు అవార్డు అందుకొంటున్నాను. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు కాదు.. మహాపురుషులు అవుతారు కాదు.. యుగ పురుషులు అవుతారు అని చంద్రమోహన్ ఎమోషనల్ అయ్యారు.

ఎన్టీఆర్ మోమోరియల్ అవార్డు వేడుకల్లో కార్యక్రమానికి టైటిల్ స్పాన్సర్ గా ఏ వి ఇన్ఫ్రాకన్,పవర్డ్ బై ఐమార్క్ డెవలపర్,అసోసియేటెడ్ స్పాన్సర్స్ వి వి కే హౌసింగ్ ఇండియా, వండర్ డైమండ్స్,నావోకి,శ్రీయం ఐ టి సొల్యూషన్స్,కేశినేని డెవలపర్,ఔట్డోర్ పార్టనర్ మీరా హార్డింగ్స్ స్పాన్సర్స్ గా వ్యవహరించారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X