Chandra Mohan Death: ముగిసిన చంద్రమోహన్ అంత్యక్రియలు, అంతిమ సంస్కారాలు చేసింది ఎవరంటే?
టాలీవుడ్ సీనియర్ నటుడు, హీరో చంద్ర మోహన్ శనివారం రోజు తుదిశ్వాస విడిచిన విషయం అందరికీ తెలిసిందే. 82 ఏళ్ల వయసు కల్గిన ఆయన గత కొంత కాలంగా గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతూ.. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే నవంబర్ 11వ తేదీన మరోసారి గుండెనొప్పి వచ్చింది. అది తీవ్రమై ఉదయం 9.45 గంటలకు ఆయన ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆయన శనివారం రోజు చనిపోగా ఈరోజు అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.
చంద్రమోహన్ పెద్ద కూతురు మధుర మీనాక్షి అమెరికాలో ఉండడం, ఆమె రావడానికి ఆలస్యం అవడంతో పాటు ఆదివారం రోజు దీపావళి పండుగ కారణంగా ఆయన అంత్యక్రియలు సోమవారం రోజు నిర్వహిస్తున్నామని కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు. అయితే శనివారం రోజు నుంచి ఆయన స్వగృహంలోనే పార్థివ దేహాన్ని ఉంచగా.. అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీకు సంబంధించిన వాళ్లు అక్కడకు వెళ్లారు. ఆయనను కడసారిగా చూసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు.

సోమవారం రోజు ఉదయమే ఫిల్మ్ నగర్ లోని చంద్రమోహన్ స్వగృహం నుంచి అంతిమ యాత్ర ప్రారంభం అయింది. ఆ అంతిమ యాత్రలో కుటుంబ సభ్యులతో పాటు వేలాది మంది అభిమానులు.. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు పాల్గొన్నారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చాలా మంది కన్నీరు పెట్టారు. ఇలా పంజాగుట్టలోని శ్మశాన వాటిక వరకు వచ్చి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. అయితే చంద్రమోహన్ కు అంతిమ సంస్కారాలు ఎవరు చేశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
చంద్రమోహన్ భార్య జలంధరతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె పేరు మధుర మీనాక్షి, కాగా చిన్న కుమార్తె పేరు మాధవి. కొడుకులు లేకపోవడంతో ఆయనకు అంతిమ సంస్కారాలు ఎవరు చేస్తారని అంతా ఆసక్తిగా చూశారు. ఈక్రమంలోనే చంద్రమోహన్ సోదరుడు అయిన మల్లంపల్లి దుర్గా ప్రసాద్.. ఆయనకు అంతిమ సంస్కారాలు చేశారు. అంత్యక్రియలు పూర్తి అయిన తర్వాత అంతా ఇంటికి వెళ్లిపోయారు.

చంద్రమోహన్ అంతిమ యాత్రలో భాగంగా టాలీవుడ్ కు చెందిన ఎంతోమంది సెలబ్రిటీలో వచ్చారు. ముఖ్యంగా హీరో విక్టరీ వెంకటేష్, జీవితా రాజశేఖర్, హీరో రాజశేఖర్, ఆదిశేషగిరి రావు, మదాల రవిలు చంద్రమోహన్ పార్థివ దేహాన్ని చూసి కన్నీరు పెట్టారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థించారు. చంద్రమోహన్ చనిపోయిన విషయం తెలుసుకున్న వెంటనే అంటే శనివారం రోజే లెజండరీ కమెడియన్ బ్రహ్మానందం ఆయన పార్థివదేహం చూసేందుకు వెళ్లారు.


Click it and Unblock the Notifications











