విజయ నిర్మల అన్నం పెట్టిన తల్లి.. ప్రేమను ఎప్పటికీ మరువలేం.. చరణ్ రాజ్ ఉద్వేగం

గిన్నిస్ బుక్ రికార్డు గ్రహీత, మేటి దర్శకురాలు విజయ నిర్మల మరణ వార్తతో సినీ, ప్రేక్షక లోకం షాక్ గురైంది. సినిమా పరిశ్రమకు ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకొంటూ శ్రద్దాంజలి ఘటిస్తున్నారు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. విజయ నిర్మల మరణవార్త తెలుసుకొని ప్రముఖ నటుడు చరణ్ రాజ్ తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటూ ...

మనందరి అభిమాన నటి, దర్శకురాలినే కాదు ఓ మంచి మనిషిని కోల్పోయాం. దేశంలోనే మొదటి మహిళా దర్శకురాలిగా గొప్ప చిత్రాలు రూపొందించారు. దర్శకురాలిగా చరిత్ర సృష్టించారు. ఆమె దర్శకురాలిగానే కాదు.. అన్నం పెట్టిన ఆ తల్లిని మరువలేం. ఆమె మాపై చూపిన ప్రేమను కూడా ఎప్పటికీ మరువలేం. ఆమె లేని లోటు వారి కుటుంబానికి మాత్రమే కాదు, తెలుగువారందరూ కుటుంబ సభ్యురాలిని కోల్పోయారు. మా గురువు కృష్ణ గారికి ఆ దేవుడు మనోధర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అని ప్రముఖ నటుడు చరణ్ రాజ్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Actor Charan Raj on Vijaya Niramala death

చరణ్ రాజ్ విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కృష్ణతోపాటు, విజయ నిర్మల రూపొందించిన పలు చిత్రాల్లో నటించారు. చరణ్ రాజ్ సినిమా పరిశ్రమకు కొత్తగా పరిచయమైన సమయంలో విజయ నిర్మల తనకు అండగా నిలిచారని చెప్పుకొన్నారు.

ఇదిలా ఉండగా, నానక్ రామ్ గూడలోని తన నివాసంలో ప్రముఖులు, అభిమానుల సందర్శనార్తం పెట్టిన విజయ నిర్మల భౌతిక కాయానికి శ్రద్దాంజలి ఘటించేందుకు భారీగా తరలి వస్తున్నారు. ఆమె అంతిమ యాత్ర శుక్రవారం ఉదయం 8 గంటలకు నానక్‌రామ్ గుడాలోని ఆమె స్వగృహం నుంచి ప్రారంభమవుతుంది. చిలుకూరులోని తన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరుగుతాయి అని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X