యాక్టర్ చరణ్‌దీప్ ఆన్‌లైన్ బిజినెస్.. కరోనా సమయంలో కస్టమర్లకు అండగా..
'బాహుబలి'లో కాలకేయ తమ్ముడిగా, వరుణ్ తేజ్ 'లోఫర్' సినిమాలో విలన్‌గా, 'సైరా నరసింహారెడ్డి', 'పీఎస్వీ గరుడవేగ', 'కల్కి'ఇటీవల పీఎస్వీ గరుడవేగ, కల్కి, సైరా చిత్రాల్లో సరికొత్త విలనిజంతో ఆకట్టుకొన్న చరణ్ దీప్ సూరినేని వ్యాపారం రంగంలోకి ప్రవేశించారు. సినిమాలపై ఫోకస్ పెడుతూ.. ఆన్‌లైన్ బిజినెస్‌లోకి ప్రవేశించారు. తన స్నేహితుడు సునీల్ కుమార్‌తో కలిసి ఫుడ్ బిజినెస్‌ను ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. జస్ట్ హ్యాప్ యాప్ ద్వారా కస్టమర్లకు సేవలు అందిస్తున్నారు.
నిత్యావసర సరుకులు, కాయగూరలు, పళ్లు, పాలు, పెరుగు, చికెన్, మటన్, ఫిష్ వంటి మాంసాహార ఉత్పత్తులు... తమకు అవసరమైన వాటిని ప్రజలు ఆర్డర్ చేస్తే.... అతి తక్కువ సమయంలో 'జస్ట్ హ్యాప్' డోర్ డెలివరీ చేస్తుందని యాక్టర్ చరణ్ దీప్ చెప్పారు.

ఇప్పటికే జస్ట్ హ్యాప్‌కి 10,000 మంది లాయల్ కస్టమర్లు ఉన్నారు. సుమారు ఏడాదిగా ప్రజలకు సేవలు అందిస్తోంది. కరోనా కాలంలో ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు నిత్యావసరాలు, కాయగూరలను తక్కువ ధరకు అందించాలని మరిన్ని ప్రాంతాల్లో 'జస్ట్ హ్యాప్' సేవలను చరణ్ దీప్ విస్తరిస్తున్నారు.
హైదరాబాద్ సిటీలో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్, మణికొండ, బాలానగర్, చింతల్, షాపూర్, జీడిమెట్ల, సుచిత్ర, కొంపల్లి సహా ఖమ్మంలో 'జస్ట్ హ్యాప్' సేవలు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని ప్రాంతాల్లో యాప్ సేవలు విస్తరించడానికి చూస్తున్నారు. చరణ్ దీప్ మాట్లాడుతూ "ఇతర ఆన్‌లైన్ స్టోర్స్ కంటే మా యాప్‌లో ధరలు తక్కువ. ప్రతిరోజూ సరికొత్త డిస్కౌంట్స్ ఉంటాయి. ఫ్రాంచైజీ కోసం ఆసక్తి కలవారు మమ్మల్ని సంప్రదించవచ్చు" అని అన్నారు.


Click it and Unblock the Notifications











