ప్రభాస్‌పై చుంకీ పాండే కామెంట్స్.. నా ముందు మోకాళ్లపై నిల్చుంటాడంటూ!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి చూపు సాహో పైనే ఉంది. ప్రభాస్ అభిమానులు సహా దేశ జనమంతా 'సాహో' సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దక్షిణాదితోపాటు ఉత్తరాదిలోనూ ఈ సినిమాకు భారీ క్రేజ్ నెలకొంది. నాలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతున్నారు యూనిట్ సభ్యులు. దర్శక నిర్మాతలు, హీరో ప్రభాస్ సహా చిత్రంలోని నటీనటులంతా ప్రచారాల్లో పాల్గొంటూ పలు ప్రెస్ మీట్స్ అటెండ్ అవుతున్నారు.
కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చుంకీ పాండే ప్రభాస్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ప్రభాస్‌ను ప్రశంసలతో ముంచెత్తుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. హీరో ప్రభాస్ చాలా పెద్ద స్టార్ అయినప్పటికీ చాలా వినయంగా ఉండే మనిషని చుంకీ పాండే తెలిపారు. ఇలాంటి స్టార్ హీరోను ఇప్పటివరకు ఎక్కడా చూడలేదని ఆయన ప్రకొందాం విశేషం. తన తోటి నటీనటుల భద్రత విషయంలో ప్రభాస్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారని, ఆయనలో ఎన్నో మంచి లక్షణాలున్నాయని తెలిపారు. సాహో సినిమాలో ఒక సన్నివేశంలో ఆయన నా ముందు మోకాళ్ల మీద కూర్చుంటాడని చెప్పుకొచ్చాడు చుంకీ పాండే.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సాహో సినిమాలో చుంకీ పాండే కీలక పాత్ర పోషించాడు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ ఆగస్టు 30న సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











