Costumes Krishna: తెలుగు విలన్, నిర్మాత కన్నుమూత.. ఆ హీరోను నమ్మి మోసపోవడంతో!
తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలోనే మన పరిశ్రమకు చెందిన ఎంతో మంది నటులు, దర్శక నిర్మాతలు, టెక్నీషియన్లు పలు కారణాలతో కన్నుమూశారు. దీంతో వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇండస్ట్రీలో మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్, నటుడు, నిర్మాత కృష్ణ తాజాగా కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. దీంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి.
కాస్ట్యూమ్ డిజైనర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టి.. ఆ తర్వాత నటుడిగా, నిర్మాతగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన ముద్రను వేసుకున్న కృష్ణ కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతోన్నారు. దీంతో పలుమార్లు కుటుంబ సభ్యులు ఆయనకు చికిత్సను కూడా అందించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆదివారం ఉదయం ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాసను విడిచారు. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్‌కు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. దీంతో ఈయన మరణంపై సినీ ప్రముఖులంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి వంటి స్టార్ హీరోలకు, వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవి వంటి స్టార్ హీరోయిన్లకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసి తన వృత్తినే ఇంటి పేరుగా మార్చుకున్నారు కాస్ట్యూమ్స్ కృష్ణ. ఆ తర్వాత నటుడిగా మారి ఎన్నో చిత్రాల్లో విలన్‌గా చేశారు. ఆ తర్వాత నిర్మాతగానూ చాలా సినిమాలను నిర్మించారు. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణతో 'అశ్వద్దామ', కోడి రామకృష్ణ దర్శకత్వంలో 'పెళ్ళాం చెపితే వినాలి', 'మా ఊరు మారదు', 'పుట్టింటికి రా చెల్లి', జగపతి బాబుతో 'పెళ్లి పందిరి' వంటి హిట్ చిత్రాలు నిర్మించారు.

కాస్ట్యూమ్స్ కృష్ణ పెద్దగా చదువుకోలేదు. దీంతో ఓ హీరో సినిమా రిలీజ్ సమయంలో కొందరు బయ్యర్లు ఆయనను మోసం చేశారని స్వయంగా చెప్పారు. అప్పటి నుంచి సినిమాలపై విరక్తి చెంది ఇండస్ట్రీకి దూరంగా ఉంటోన్నారు. ఇదిలా ఉండగా.. కాస్ట్యూమ్స్ కృష్ణ అంత్యక్రియలు సోమవారం జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications











