టాలీవుడ్‌కు మరో వారసుడు.. ప్రముఖ నటుడి కుమారుడు హీరోగా వైరం.. టీజర్ ఎలా ఉందంటే?
తెలుగు తెరపై నట వారసుల ప్రవాహం కొనసాగుతున్నది. ఇప్పటికే చాలా మంది నటులు కుమారులు వారసత్వాన్ని చేజిక్కించుకొని తమ ప్రతిభతో అదృష్టాన్ని పరిష్కరించుకొన్నారు. తాజాగా మరో నటుడు కుమారుడు హీరోగా టాలీవుడ్‌లో ప్రవేశిస్తున్నారు. నటుడిగా తెలుగువారికి చేరువైన దేవరాజ్ కుమారుడు ప్రణం దేవరాజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

ప్రణవ్ హీరోగా తెరకెక్కించే చిత్రాన్ని యువాన్స్ నాయుడు సమర్పణలో భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి పిక్చర్, సంస్కృతి ప్రొడక్షన్స్, సర్తాక్ పిక్చర్స్ బ్యానర్స్‌పై వైరం టైటిల్‌తో తెరకెక్కుతున్నది. ఈ సినిమాకు సాయి శివం జంపాన దర్శకత్వంలో జే.మల్లికార్జున నిర్మిస్తున్న చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా దేవరాజ్, చంద్ర దేవ రాజ్ చేతుల మీదుగా శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి బ్యానర్ లోగోను లాంచ్ చేశారు. బెనర్జీ, కాశీ విశ్వనాథ్ చేతుల మీదుగా వైరం టీజర్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా
సీనియర్ నటులు దేవరాజ్ మాట్లాడుతూ...తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరించారు. ఇప్పుడు వస్తున్న నా కొడుకును కూడా అదే విధంగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దర్శకుడు చెప్పిన కథ నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమా టీజర్ కు కన్నడలో మంచి రెస్పాన్స్ వచ్చింది అని అన్నారు.

చిత్ర దర్శకుడు సాయి శివన్ జంపాన మాట్లాడుతూ.. తెలుగు, కన్నడలో సినిమా చేశాము. కన్నడలో రాణిస్తున్న ప్రజ్వల్ దేవరాజ్, ప్రణం దేవరాజ్‌కు వీరి తండ్రి దేవరాజ్ గారికి నేను చెప్పిన నచ్చడంతో ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమాను దేవరాజ్ వంటి స్టార్ హీరో కొడుకు నా సినిమాలో హీరో గా చేస్తున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది అని అన్నారు.
చిత్ర హీరో ప్రణం దేవరాజ్ మాట్లాడుతూ.. సాయి గారు నాకు మంచి సినిమా ఇచ్చారు. సామల భాస్కర్ మమ్మల్ని చాలా బాగా చూయించారు. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు. మా తల్లి తండ్రులు సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడై వరకు వచ్చే వాన్ని కాదు.తెలుగు ప్రేక్షకులు మా నాన్న దేవరాజ్ గారిని ఆదరించి నట్లే వైరం సినిమాతో వస్తున్న నన్ను కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.
హీరోయిన్ మోనల్ మాట్లాడుతూ. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.
నటీ నటులు: ప్రణం దేవరాజ్, విన్ను మద్ది పాటి, మోనల్,, గరుడ రామ్, కాశీ విశ్వనాధ్, శత్రు, చమ్మక్ చంద్ర, భద్రం తదితరులు
నిర్మాత: జె.మల్లికార్జున
డైరెక్టర్: సాయి శివన్ జంపాన
కో ప్రొడ్యూసర్స్: అరిపిరాల కళ్యాణ్ శాస్త్రి, శీలం త్రివిక్రమ్ రావు
మ్యూజిక్: మహతి స్వర సాగర్
సినిమాటోగ్రఫి: సామల భాస్కర్
ఎడిటర్: అజయ్ యం.కుమార్
కొరియోగ్రాఫర్: శిరీష్,భూషణ్ మురళి
స్టంట్స్: మాస్ మధ, రాం సుంకర, లయన్ జి.
ఆర్ట్: రవి కుమార్ ఎం
పీఆర్వో: హర్ష


Click it and Unblock the Notifications











