Madam Chief Minister భరతమాత ముద్దు బిడ్డగానే.. అమెరికాలో ఉన్నా నా అస్థిత్వం అదే!

సమాజానికి స్పూర్తి అందించే చిత్రాలు తెలుగు సినిమా పరిశ్రమలో అప్పుడప్పుడు వస్తుంటాయి. అలాంటి చిత్రాలు ప్రేక్షకుల్లో స్పూర్తిని రగిలిస్తాయి. అలాంటి సమాజ స్పూర్తిని పెంపొందించే చిత్రంగా మేడమ్ చీఫ్ మినిస్టర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమాను డాక్టర్ సూర్య రేవతి మెట్టకూరు హీరోయిన్‌గా నటించడం కాకుండా దర్శకత్వం వహిస్తూ.. నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం కార్యక్రమం ప్రఖ్యాత అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుహాస్‌ మీరా, ఎస్‌బీ రామ్‌ (డాక్టర్ సూరి భసవంతం రామ్) ఫౌండేషన్ సభ్యులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్ఆర్పీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న మేడమ్ చీఫ్ మినిస్టర్ సినిమా వేడుకలో నటి, దర్శక, నిర్మాత డాక్టర్ సూర్య రేవతి మాట్లాడుతూ...

నాకు మొదటి నుంచి మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. వారి సపోర్ట్ ఎలా ఉందంటే? ..నాకు అందరి మాదిరిగానే అమెరికాకు వెళ్లాలనే డ్రీమ్ ఉండేది. అమెరికాకు వెళ్లి ఉన్నత చదువులు చదివాను. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీహెచ్‌డీ చేశాను. కంపెనీలు ఎస్టాబ్లిష్ చేశాను. అమెరికాలో ఉన్నా నేను ఇండియాను మరిచిపోలేదు. భారత్ నా అస్థిత్వంగా భావిస్తాను. నేను ఎప్పుడూ భరతమాత ముద్దు బిడ్డగానే ఫీల్ అవుతాను. అలా చెప్పుకోవడానికి గర్వంగా ఫీలవతాను అని సూర్య రేవతి తెలిపారు.

 Madam Chief Minister

అమెరికాలో నన్ను చూసి మీ డ్రస్ బాగుంటుంది. మీ స్మైల్ బాగుంటుంది అని ప్రశంసిస్తే.. నాలో ఆత్మగౌరవం పెరిగింది. భారతనారిగా తెల్లవాళ్లు ఇచ్చిన గౌరవంగా భావిస్తాను. మనం సంసార గొడవలో పడి అన్నీ మరిచిపోతుంటాం. అమెరికాలో నా మొదటి రోజు నుంచి ఒకటే అనుకొన్నాను. నా దేశాన్ని, నా మూలాలు మరిచిపోవద్దని అనుకొన్నాను. చిన్న వయసులోనే నాకు సక్సెస్ లభించింది. ఆ క్రమంలో తల్లిదండ్రుల రుణం, గురువు రుణం, దేశ రుణం తీర్చుకోవాలనే తపన ఉండేది. నేను నా దేశానికి వచ్చి ఈ దేశానికి ఏదో చేయాలనే తపన ఉండేది. ఆ రకంగా ఏం చేయాలని అనుకొన్న సమయంలో సామాజిక సేవ చేయాలని అనుకొన్నాను అని సూర్య రేవతి చెప్పారు.

 Madam Chief Minister

పేదవాళ్లకు పేదరికం శాపం. పేదవాళ్లను ఆదుకొనేందుకు ఓ గ్రామాన్ని దత్తత తీసుకొన్నాను. దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు అని గాంధీజీ చెప్పిన మాటను ఆచరణలో పెట్టాను. అలా గ్రామాన్ని దత్తత తీసుకొని.. విద్యకు ప్రాధాన్యం ఇచ్చాను. ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా తీర్చి దిద్దాను. నా సంపాదనలో కొంత శాతం సమాజ సేవకు ఇవ్వాలని అనుకొన్నాను సూర్య రేవతి అన్నారు.


సాంకేతిక నిపుణులు:
కథ, నిర్మాత, దర్శకత్వం: సూర్య రేవతి మెట్టకూరు
మాటలు, స్క్రీన్ ప్లే: సుహాస్‌ మీరా
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌, ప్రొడక్షన్ డిజైనర్‌: రామకృష్ణ పాలగాని
మ్యూజిక్: కార్తీక్‌ బీ కొండకండ్ల
కెమెరా: వల్లెపు రవికుమార్‌
ఎడిటర్‌: సురేష్ దుర్గం
పాటలు: పూర్ణాచారి
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌ మేనేజర్‌: ఎం వెంకట చందుకుమార్‌
పిఆర్వో: మధు విఆర్‌

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X