ఇర్ఫాన్ ఇదేమీ బాగాలేదు.. ఇలా వదిలేస్తావా? భోరుమంటూ అనుపమ్ ఖేర్

బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఆకస్మిక మరణం సినీ ప్రముఖులనే కాకుండా సగటు సినీ ప్రేక్షకుడికి గుండె కోతపెడుతున్నది. ఆయనతో ఉన్న తమకు ఉన్న అనుబంధాన్ని తలచుకొని భావోద్వేగానికి గురవుతూ కంటతడి పెడుతున్నారు. తాజాగా ఇర్ఫాన్ ఖాన్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని మరో విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ కన్నీటి పర్యంతమయ్యారు.

నేషనల్ డ్రామా ఆఫ్ స్కూల్‌లో ఇర్ఫాన్ ఖాన్ శిక్షణ పొందారు. ఆ సమయంలో అనుపమ్ ఖేర్‌కు జూనియర్‌గా ఉన్నారు. ఆ తర్వాత 2007లో అప్నా ఆస్మాన్ చిత్రంలో ఇద్దరూ కలిసి నటించారు. అలాంటి అనుబంధం ఉన్న ఇర్ఫాన్ ఖాన్ ఇకలేరనే వార్తతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Actor Irrfan Khan death: Anupam Kher completely shattered

ఇర్ఫాన్ మరణ వార్తతో తీవ్ర దిగ్బ్రాంతికి లోనైన అనుపమ్ ఖేర్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో స్పందిస్తూ.. నా ప్రియమైన స్నేహితుడు, కొలీగ్, డ్రామా స్కూల్‌లో నాకు జూనియర్ ఇర్ఫాన్ ఖాన్ విషాదంలో మునిగిపోయాను. కేవలం హిందీ సినిమాకే లోటు కాదు.. ఈ వినోద ప్రపంచానికి తీరని నష్టమని భావిస్తున్నాం. అద్భుతమైన యాక్టర్ కాకుండా మానవతావాది. ముక్కుసూటి మనస్తత్వం కలిగిన వ్యక్తి. అద్బుతమైన సెన్సాఫ్ హ్యూమర్ ఉంటుంది అంటూ భోరున విలపించారు.

కరోనావైరస్ లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇర్ఫాన్ ఖాన్ మరణం మరింత విషాదంగా మారింది. ఇలాంటి పరిస్థితి రావడం అత్యంత దారుణం అని సినీ ప్రముఖులు పేర్కొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X