నా లెక్క ప్రకారం 1000కోట్లు ఉండాలి.. క్యాసినో అలవాటు.. ఆ డబ్బు ఎలా పోయిందంటే: జగపతిబాబు

ఒకప్పుడు లవర్ బాయ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను అందుకున్న జగపతిబాబు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో ఒక బ్రాండ్ హీరోగా కూడా నిలదొక్కుకున్నాడు. అలాంటి హీరో ఒకానొక సమయంలో మాత్రం చాలా దీన పరిస్థితిలో కూడా ఎదుర్కొన్నాడు. బ్యాక్ ఎకౌంట్ లో రూపాయి లేని రోజును చూశాడు. అలాంటి జగపతిబాబు ఇప్పుడు నెగిటివ్ పాత్రలతో మంచి ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నాడు. అయితే ఆయన ఆస్తుల లెక్క విషయంపై మొదటిసారి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓపెన్ గా తెలియజేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

వరుసగా ప్లాప్స్ రావడంతో..

వరుసగా ప్లాప్స్ రావడంతో..

జగపతి బాబు తండ్రి సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు నిర్మాతగా చాలా సినిమాలను నిర్మించారు. ఇక అదే బ్యానర్లో జగపతిబాబు కూడా హీరోగా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. అయితే ఒకానొక సమయంలో మాత్రం ఆయన వరుసగా ఏడు సినిమాలతో డిజాస్టర్ ఎదుర్కొనడంతో ఒక్కసారిగా ఫామ్ కోల్పోయారు. మార్కెట్ తగ్గిపోవడంతో ఆయన కొన్ని అవమానాలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.

భోజనం పెట్టలేదు.. గౌరవం ఇవ్వలేదు

భోజనం పెట్టలేదు.. గౌరవం ఇవ్వలేదు

జగపతి బాబు మాట్లాడుతూ.. ఒకసారి ఒక మరొక హీరో తో సినిమా చేస్తున్నప్పుడు సరిగ్గా భోజనం కూడా పెట్టలేదు సెట్లో.. గౌరవం కూడా ఇవ్వని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక లైట్ మ్యాన్ వచ్చి అయితే నా కాళ్ళ దగ్గర కూర్చొని కూడా ఆ పరిస్థితిని చూసి ఏడ్చాడు. ఆ విధమైన ఎన్నో చేదు అనుభవాలను నేను ఎదుర్కొన్నాను. మొదట్లో అలాంటి మూమెంట్స్ అంటే ఏమిటో నాకు తెలియలేదు. కానీ అలాంటి బాధలు ఎదురైనప్పుడు మాత్రం అదొక లర్నింగ్ అని అర్థమయింది.. అని జగపతిబాబు అన్నారు.

డబ్బు వలన టెన్షన్

డబ్బు వలన టెన్షన్

జీవితంలో కొన్ని చేదు అనుభవాలను కూడా మనం చూడాలి అప్పుడే మరింత బలంగా తయారవుతాం. అదృష్టవశాత్తు మాకు అలాంటివి అప్పట్లోనే వచ్చాయి. ఇంకా ఆస్తుల గురించి అయితే నేను పెద్దగా పట్టించుకోను డబ్బు అనేది మనిషికి ఒక జబ్బు లాంటిది. ఒక పరిధి వరకు సంపాదించుకోగలిగితే బాగుంటుంది కానీ.. అది లిమిట్ దాటితే టెన్షన్ తప్ప ఏమీ ఉండదు.. అని జగపతి అన్నారు.

నాగార్జున.. బిజినెస్ మైండ్

నాగార్జున.. బిజినెస్ మైండ్

డబ్బు విషయంలో ఇండస్ట్రీలో చాలామందికి పెరిగిపోతు ఉండడం వలన లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. ఈ విషయంలో అయితే నాగార్జున ఒక్కడే చాలా కరెక్ట్ గా వెళుతున్నాడు. డబ్బుకు ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ ఇచ్చి లైఫ్ ను డబ్బుతో ఎంజాయ్ కూడా చేయగలడు. ఇక ఎవరికి ఎంత ఇవ్వాలో కూడా తన పర్ఫెక్ట్ గా ఇవ్వగలడు. ఆ విషయంలో అతని పర్ఫెక్ట్ బిజినెస్ మైండ్ అని అర్థమయింది.. అని జగపతిబాబు తెలియజేశాడు.

 1000 కోట్లు ఉండాలి

1000 కోట్లు ఉండాలి

నాకు డబ్బు విషయంలో అయితే జీరో నాలెడ్జ్. ఒకప్పుడు నేను సంపాదించుకున్న ఆస్తుల లెక్క ప్రకారం అయితే ఇప్పటికే 1000 కోట్లు ఉండాలి. అయితే ఆ డబ్బు ఎందుకు ఇప్పుడు లేదు అనేది ఒక పెద్ద ప్రశ్న. సమాధానం చెప్పడం కూడా కష్టం. మిగతావాళ్లు అనుకున్నట్లుగా చాలా వరకు క్యాసినోలో నేను పోగొట్టుకున్నాను అని అనుకుంటారు. నేను క్యాసినో ఎంటర్టైన్మెంట్ కోసం అడతాను కానీ పేకాట అలాంటివి ఆడను. అది కూడా ఒక లిమిట్ మాత్రమే కానీ దానివల్ల డబ్బు మొత్తం ఏమీ పోలేదు.. అని జగపతి చెప్పారు.

అంత డబ్బు ఎలా పోయిందంటే..

అంత డబ్బు ఎలా పోయిందంటే..

పూర్తిగా క్యాసినో వల్ల అయితే నా డబ్బు పోలేదు. అది ఇవ్వటం వల్ల పోయిందో లేదంటే వేరే ఎవరైనా మోసం చేయడం వల్ల పోయిందో.. అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. నా ప్రకారమైతే ఒకరి మీద బ్లేమ్ చేయలేను. చాలామంది వల్ల బ్రోకర్స్ వల్ల మోసం పోయి ఉండొచ్చు. కానీ నా విషయం గురించి కూడా పెద్దగా పట్టించుకోను. మీరు జాగ్రత్తగా ఉంటే మీ డబ్బులు కూడా జాగ్రత్తగా ఉంటుంది. ఆ విషయంలో నా పొరపాట్లు కూడా ఉన్నాయి అని జగపతిబాబు వివరణ ఇచ్చారు.

ఇప్పుడున్న ఆస్తులు

ఇప్పుడున్న ఆస్తులు

ఆ ఆస్తులు విషయంలో మాత్రం పిల్లలకు ఒకటే క్లారిటీ ఇచ్చాను. నేను నా బ్యాంకులో ఒక్క రూపాయి కూడా లేనప్పుడు 30 కోట్లు ఉంటే చాలు అనుకున్నాను. నా లైఫ్ లో నా పిల్లలకు అది సరిపోతుంది. వాళ్ళకు ఇది మాత్రమే మన దగ్గర ఉంది అని క్లారిటీగా చెప్పాను. వాళ్లు కూడా ఎప్పుడు హై లెవెల్లో ఆలోచించలేదు. హ్యాపీగా ఉంటే చాలు ఉన్నదాంట్లో.. అని అనుకునేవారు.. అని జగపతిబాబు తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X