కొంతమంది హీరోలు అలా, బాలయ్య ఇలా.. తప్పేముంది?, బాలయ్య గురించి జోష్ రవి సంచలన వ్యాఖ్యలు!

నందమూరి బాలకృష్ణ గురించి ఎవరు ఎన్ని చెప్పినా ఫ్యాన్స్ మాత్రం ఆయనను అభిమానించడం మానరు. బాలకృష్ణ అప్పుడప్పుడు తనతో అతిగా ప్రవర్తించే వారి మీద చేయి చేసుకుంటూ ఉంటారు. అది తన ఫ్యాన్స్ అయినా సరే అని పట్టించుకోరు. తాజాగా ఈ చేయి చేసుకోవడం గురించి నటుడు జోష్ రవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

జోష్ తో మంచి పేరు

జోష్ తో మంచి పేరు

నటుడు జోష్ రవి అంటే తెలియని తెలుగు వారు ఉండరు.. బహుశా పేరు గుర్తుండక పోయినా తెర మీద ఆయన ముఖం చూడగానే ఇట్టే గుర్తు పట్టేస్తారు. నాగచైతన్య మొదటి సినిమా జోష్ తో మంచి పేరు తెచ్చుకున్న ఆయన నిజానికి అంత కంటే రెండేళ్ల ముందు నుంచే సినీ రంగంలో ఉన్నారు.. అనేక ప్రయత్నాలు చేస్తున్న సమయంలో తన తల్లి నాగ చైతన్య సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయని టీవీ స్క్రోలింగ్ లో చూసి చెప్పారని అలా వెళ్ళిన తనకు ఆ అవకాశం రావడం తన అదృష్టమని జోష్ రవి చెబుతుంటారు.

 50కి పైగా సినిమాల్లో

50కి పైగా సినిమాల్లో

అలా జోష్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన సుమారు ఇప్పటిదాకా 50కి పైగా సినిమాల్లో నటించారు. అయితే తాను సినీరంగంలో ప్రవేశించింది కమెడియన్గా నిలదొక్కుకోవడానికి కాదని తమ క్యాలిబర్ వేరే ఉందని ఆయన పలు సందర్భాల్లో వ్యక్తపరుస్తుంటారు. అయితే ఆయన తన సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు మెగా హీరోలకు సంబంధించి అనేక పోస్ట్ లు పెడుతూ ఉండడంతో ఆయన మెగా అభిమానిగా పేరు సంపాదించాడు. అలాంటి ఆయన నందమూరి హీరో బాలకృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 ట్రెండింగ్ లో బాలకృష్ణ

ట్రెండింగ్ లో బాలకృష్ణ

ఈ రోజుకి నందమూరి బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమా విడుదలై 30 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ యవ్వనంలో ఉన్న ఒక ఫోటో పెట్టిన జోష్ రవి బాలయ్య బాబు గారు ఆయన మనసు, నవ్వు రెండు స్వచ్ఛమైనవే అంటూ కామెంట్ చేశారు. ఇంతలో ఒక ఒక నెటిజన్ వచ్చి చెయ్యి జాడింపుకోసం నీ వెర్షన్ చెప్పు బ్రో అని అడిగారు.

అక్కడే జాడిస్తాడు తప్పేముంది

అక్కడే జాడిస్తాడు తప్పేముంది

ఇంకేముంది సీరియస్ అయిన జోష్ రవి ఆ నెటిజన్ కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఇలా నోరు జాడింపు మనుషులను బట్టి ఆయన చేయి జాడింపు ఉంటుంది.. కొంతమంది హీరోలు వెనుక చెయ్య విధిలిస్తారు.. ఆయన అక్కడే జాడిస్తాడు తప్పేముంది.. నిజానికి ఆయన అంత మంచి మనుషులు హీరోలలో తక్కువ ..ఆయన బోలా మనిషి బంగారం.. మన పద్ధతిని బట్టి ఆయన రియాక్షన్ అంతే.. అంటూ చెప్పుకొచ్చారు.

 రవి గారు పెట్టిన పోస్ట్ చూడండి

రవి గారు పెట్టిన పోస్ట్ చూడండి

అయితే ఆయన స్వతహాగా మెగా అభిమాని కావడంతో ఇతరులు కూడా ఆయనని కించపరిచేలా కామెంట్ చేయడానికి ట్రై చేస్తే మిగతా హీరోల అభిమానులు కూడా డూప్లికేట్ ఫ్యాన్స్ కొంచెం రవి గారు పెట్టిన పోస్ట్ చూడండి, ఏ హీరో ఎందులోనూ తక్కువ కాదు అని దాని అర్థం అని కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X