మరిదితో కలసి నటించేందుకు ఓకె చెప్పిన జ్యోతిక!
హీరో సూర్యతో వివాహం తర్వాత జ్యోతిక వెండితెరకు దూరమైంది. ఇటీవల సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. గత ఏడాది జ్యోతిక కాట్రిన్ మొళి చిత్రంలో నటించింది. జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ లో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలపై దృష్టి పెట్టింది. తాజాగా ఓ క్రే చిత్రానికి జ్యోతిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తన మరిది కార్తీతో కలసి నటించేందుకు జ్యోతిక ఓకె చెప్పిందట.
హిట్స్, ప్లాప్స్ అని సంబంధం లేకుండా కార్తీ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. కార్తీ ఇటీవల మలయాళీ దర్శకుడు జీతూ జోసెఫ్ చెప్పిన కథకు ఓకె చెప్పాడట. దృశ్యం చిత్రంతో జీతూ జోసెఫ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. కార్తీకి చెప్పిన కథ కూడా వైవిధ్యభరితమైనదే అని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం జ్యోతికని సంప్రదించినట్లు తెలుస్తోంది. తన పాత్ర అద్భుతంగా ఉండడంతో నటించేందుకు వెంటనే అంగీకారం తెలిపింది.

ఈ కాంబినేషన్ తో రియల్ లైఫ్ మరిది, వదినలు వెండి తెరపై కనిపించనున్నారు. ఇటీవల కార్తీ నటించిన దేవ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశపరిచింది. ఇటీవల ఓ డెబ్యూ దర్శకుడికతో కార్తీ చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ రెండు చిత్రాల షూటింగ్ ఒకేసారి జరగనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











