Pawan kalyanకు పెరుగుతున్న మద్దతు.. ఆయన మాట్లాడింది నిజమే, ఫుల్ సపోర్ట్ ప్రకటించిన కార్తికేయ
రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఆయన నెమ్మదిగా మద్దతు పెరుగుతోంది. ముందు నుంచి ఎవరూ కూడా ఆయన వ్యాఖ్యల మీద స్పందించరని అనుకుంటూ ఉండగా ముందుగా నేచురల్ స్టార్ నాని ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్లో న్యాయం ఉందని ఆయన మాటలు పట్టించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమ విషయంలో ఆలోచన చేయాల్సి వుందని కోరారు. తాజాగా ఈ విషయంలో స్పందించిన హీరో కార్తికేయ కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ట్వీట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

ఆర్ఎక్స్ 100 అంటూ
ఆర్ఎక్స్ 100 సినిమాలో శివ పాత్ర ద్వారా కార్తికేయ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. నిజానికి ముందు ప్రేమతో మీ కార్తిక్ అనే సినిమా చేసినా ఆ సినిమా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. అయితే ఆర్ఎక్స్ 100 సినిమాలో ప్రేమించి ఒక అమ్మాయి చేతిలో మోసపోయి చివరికి ఆమె చేతుల్లోనే చనిపోయిన పాత్రలో కార్తికేయ నటించాడు అనడం కంటే జీవించాడు అనడం సరిపోతుందేమో.

సూపర్ క్రేజ్
అలా ఈ సినిమా ద్వారా కార్తికేయ కు ఎనలేని గుర్తింపు లభించింది. పాయల్ రాజ్ పుత్ కార్తికేయ మధ్య సీన్లు వారి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంత సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా తర్వాత కూడా కార్తికేయ వరుసగా సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి.

చాలా సెలక్టివ్ గా
అయితే కార్తికేయ వెంట వెంటనే సినిమాలు ఒప్పుకోకుండా చాలా సెలెక్టివ్ గా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ప్రస్తుతం రాజా విక్రమార్క అనే సినిమాలో ఆయన హీరోగా నటిస్తుండగా ఈ సినిమా త్వరలో విడుదలకు కూడా సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో కన్నడ భామ తాన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో కార్తికేయ ఒక ఎన్ ఐ ఏ ఆఫీసర్ గా నటిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక మరో పక్క ఆయన అజిత్ హీరోగా నటిస్తున్న వలిమై సినిమాలో విలన్ పాత్రలో నటించారు. ఆ సినిమా కూడా విడుదలకు సిద్ధం అవుతోంది.

నా బాధ్యత
ఇక తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ట్వీట్ చేశారు. "నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఏ పార్టీకి మద్దతుగా నిలవడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన లేవనెత్తిన సమస్యలు పరిగణించాల్సినవని అన్నారు. సినిమా పరిశ్రమలో ఒకడిగా మా అందరి తరఫున మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వడం నా బాధ్యత" అని కార్తికేయ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
Recommended Video

మనకెందుకు
అయితే ఈ ట్వీట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ''పెద్ద పెద్దోళ్ళే మూసుకు కూర్చున్నారు అన్నా.. రేపు వాళ్ళు బాగానే ఉంటారు.. నువ్వు బలి అవుతావు.. అవసరమా చెప్పు'' అంటూ ఈ ఇష్యూ కి దూరంగా ఉండమని కార్తికేయ ట్వీట్ కి రిప్లై ఇస్తుంటే రికొందరేమో.. పెద్దవాళ్లే కాకుండా ఇండస్ట్రీలో యంగ్ స్టర్స్ కూడా ఈ విషయం మీద ఇలాగే మాట్లాడాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











