బుద్ది లేకుండా అలా అంటావా? వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై టాలీవుడ్ డైరెక్టర్ ఫైర్

ఏపీలో టికెట్ రేట్ల తగ్గింపు వ్యవహారం సంచలనంగా మారింది. ఇప్పటికే ప్రభుత్వ తీరును కొంత మంది సినిమా వాళ్ళు తప్పు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమా వాళ్ళు "బలిసి" కొట్టుకుంటున్నారు అంటూ నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యల మీద దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆ వివరాలు

"బలిసి" కొట్టుకోవడం లేదు

నువ్వు లేక నేను లేను సినిమాతో దర్శకుడిగా ఆరంగ్రేటం చేసిన కాశీ విశ్వనాథ్.. తొలిచూపులోనే సినిమాకి కూడా దర్శకత్వం వహించారు. నచ్చావులే సినిమాతో నటుడిగా కూడా పరిచయం అయ్యారు. ఆ సినిమా నుంచి కాశీ విశ్వనాథ్ నటుడిగా కొనసాగుతున్నారు. వందకు పైగా సినిమాల్లో నటించిన కాశీ విశ్వనాథ్ తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం దగ్గర్లోని సీతానగరం మండలం, పురుషోత్తపట్నంలో జన్మించారు.

అయితే ఆయన తన సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యేను ఉద్దేశిస్తూ ఒక లేఖ రాశారు. గౌరవనీయులు ఎమ్మెల్యే నల్లపురెడ్డి . ప్రసన్నకుమార్ రెడ్డి గారు సినిమా వాళ్ళు "బలిసి" కొట్టుకోవడం లేదు, "భయం"తో బతుకు జీవుడా.. అని కొట్టుమిట్టాడుతున్నారు అని ఆయన అన్నారు.

బుద్ధి లేకుండా ఎలా అనబుద్ది అయింది సార్

బుద్ధి లేకుండా ఎలా అనబుద్ది అయింది సార్

ఒక పక్క "కరోనా" వల్ల..భయంతో ప్రేక్షకులు థియేటర్ కి రాక, ఇంకో పక్కన.. మీరు టికెట్ రేట్స్ తగ్గించడం, ఆ పైన.. థియేటర్ లో సగం టికెట్స్ అమ్మాలనడం మూలంగా ఎగ్జిబిటర్లు బలిసి కాదు.. అలిసి.. సొలసి థియేటర్ లు మూసేస్తున్నారు అని కాశీ విశ్వనాధ్ పేర్కొన్నారు. . ముఖ్యంగా.. నిర్మాతలు, పెట్టుబడులు పెట్టి వడ్డీలు కడుతూ సినిమాలు బిజినెస్ అవ్వక, పని చేసిన ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్ కి రెమ్యూనరేషన్ ఇస్తూ రిలీజ్ కి సరైన థియేటర్స్ దొరక్క అనేక ఇబ్బందులు పడుతుంటే "సినిమా హాళ్ళు" వున్న మీరు ''సినిమా వాళ్ళు" బలిసి కొట్టుకుంటున్నారు" అనే మాట బుద్ధి లేకుండా ఎలా అనబుద్ది అయింది సార్ ? మా తెలుగు దర్శకుల సంఘంలో.. 2000 మంది సభ్యులుంటే వారిలో 500 మందికే పని ఉంటుంది. మిగతా వాళ్ళు పని లేక, ఆదాయం లేక, ఆకలితో అప్పులు చేసుకుని బతుకుతుంటే ఎలా బలిసి కొట్టుకుంటారు సార్..? అని ప్రశ్నించారు.

మీకు ఏం నష్టం జరిగిందని అలా

మీకు ఏం నష్టం జరిగిందని అలా

అలాగే టెక్నీషియన్స్ సినిమాల్లో పని లేక ఫంక్షన్స్ లోను, పెళ్ళిళ్ళ లోని, మేకప్ లు వేసుకుంటూ, ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ డెకరేషన్స్ చేసుకుంటూ బతుకుతున్నారు. వీళ్ళు ఎలా బలిసి కొట్టుకుంటారు సార్..? "మా" అసోసియేషన్ లో.. దాదాపు 1000 మంది.. ఆర్టిస్టులు, ఆర్టిస్ట్ అసోసియేషన్స్ లో.. 600 మంది నటులుంటే, పర బాషా నటులతో, ప్రవేశంతో డబ్బులు తీసుకోరని పెట్టుకునే సినిమా ఇంట్రెస్ట్ ఉన్న కొత్త వాళ్ళ తాకిడితో ఆర్టిస్టులు వేషాలు లేక అతలాకుతలం అవుతుంటే ఎలా బలిసి కొట్టుకుంటారు సార్..? అని ప్రశ్నించారు. ఇక అతి ముఖ్యంగా రెక్కాడితే గాని డొక్కాడని మా ఫెడరేషన్ కార్మికులు, జూనియర్ ఆర్టిస్టులు, రోజూ వారీ వేతనాలు పెరగక వచ్చిన డబ్బులతో, ఎండనకా వాననకా, రెక్కలు ముక్కలు చేసుకుని, ఏ పూటకాపూట కడుపు నింపుకుంటుంటే ఎలా బలిసి కొట్టుకుంటారు సార్? సినిమా వాళ్ళు, సినిమా హాళ్ళు, వల్ల మీకు ఏం నష్టం జరిగిందని అలా 'కామెంట్' చేశారు ? అని ప్రశ్నించారు.

ఏమి సాధించారు..?

ఏమి సాధించారు..?

తప్పు సార్.. ఒక 'మాట' అనేముందు వందసార్లు ఆలోచించాలి. లూజ్ టంగ్ తో ఆ మాట అని ఏమి సాధించారు..? ఇంతకు ముందు వరకు సినిమా వాళ్ళలో మీ మీద ఎలాంటి నెగిటివ్ అభిప్రాయం లేదు. కానీ ఇప్పుడు దాదాపు 50, 000 కుటుంబాలు, సినిమా హీరోలను అభిమానించే లక్షలాది అభిమానులను, సినిమాను ప్రేమించి, చూసే కోట్లాది ప్రేక్షకుల మనసులను గాయపర్చడం కరెక్ట్ కాదు సార్. ఇప్పడు అందరి హృదయాలలో మీరు నెగిటివ్ పర్సన్ గా మిగిలిపోవడం తప్ప, ఏమి సాధించారు..? మా సినిమా వాళ్ళు ఎప్పుడూ ఒకరిని ఇబ్బంది పెట్టకుండా.. ఒక తపోదీక్షతో సినిమాలు తీసుకుంటూ ఆత్మగౌరవంతో బతుకుతారు. అంతేగాని ఎవరినీ.. అనవసరంగా పరుష పదజాలంతో.. 'కామెంట్' చెయ్యరని ఆయన అన్నారు.

Recommended Video

Viswadarsanam Movie Trailer Launch By K Viswanath Garu | Tanikella Bharani | FilmiBeat Telugu
అవమానించవద్దు ప్లీజ్

అవమానించవద్దు ప్లీజ్

అంతెందుకూ మా వాళ్ళు ఎప్పుడైనా మీ రాజకీయ నాయకుల్ని "బలిసి కొట్టుకుటటున్నారు" అని అన్నారా? చెప్పండి ! ఒక కులాన్ని కామెంట్ చేస్తే ఆ కులం వాళ్ళందరూ గుంపుగా వచ్చి మీద పడిపోతారు. అలాంటిది మా సినిమా కులం వారిని మీరు ఇష్టమొచ్చినట్టు అవమానిస్తే మాకు బాధ కలగదా సార్ ! వినోదం ఇవ్వడం తప్ప, సమాజానికి ఏ హాని చేయని సినిమా వాళ్ళని దయ చేసి ఎప్పుడూ అనుమానించకండి.. అవమానించకండి. కదిరితే మా కుల దేవత "సినీ కళామతల్లి"ని కాపాడే ప్రయత్నం చేయండి. అలాగే వీలుంటే..టికెట్ రేట్లు పెరగడానికి సహాయం చెయ్యండి.. లేకపోతే సైలెంట్ గా ఉండండి. అంతే గానీ సినిమా వాళ్ళని అనవసరంగా అవమానించవద్దు ప్లీజ్ అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా కోరారు. ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X