Krishnam Rajuకి గాయాలు.. హుటాహుటిన అపోలోకి.. అసలు ఏమైందంటే?
టాలీవుడ్ కు సంబంధించి మరో షాకింగ్ న్యూస్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.. టాలీవుడ్ సీనియర్ హీరో ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ గా ఉన్న ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజుకు గాయాలయ్యాయని మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. అసలు కృష్ణం రాజుకు ఏమైంది? ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు ? అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

వరుస షాకులు
టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ అంతా ఆ టెన్షన్ లోనే ఉంది. అయితే సాయి ధరంతేజ్ అక్రమంగా కోలుకోవడం కాస్త ఆనందం కలిగించే విషయమే అయినా నిన్న సీనియర్ నటుడు ఉత్తేజ్ భార్య మరణం కూడా టాలీవుడ్ మొత్తం శోక సంద్రంలో మునిగి పోయే లాగా చేసింది.
ఇప్పుడు తాజాగా నటుడు కృష్ణంరాజు ప్రమాదానికి గురయ్యారని వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఆయన బాత్రూంలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడ్డారు అని ప్రచారం జరుగుతోంది.

తుంటికి గాయం
ఆయన కింద పడడంతో తుంటి భాగానికి ఫ్రాక్చర్ కాగా అపోలో వైద్యులు ఈ రోజు ఉదయం దానికి శస్త్రచికిత్స చేశారు అని అంటున్నారు. . ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని ఆయన శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్నారని తెలుస్తోంది.. కృష్ణంరాజు బాత్రూంలో జారి పడగా ఆయనకు గాయాలయ్యాయని హుటాహుటిన అపోలో హాస్పిటల్ కి తరలించగా ఆయనకు శస్త్రచికిత్స చేశారు అంటూ మీడియాలో స్క్రోలింగ్స్ వచ్చాయి. కానీ దానికి విరుద్ధంగా కృష్ణంరాజు కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది..

అదేమీ లేదు
కృష్ణంరాజు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని ఆయన ఎప్పటిలాగే రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే అపోలో హాస్పిటల్ కు వచ్చారు అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే అపోలో హాస్పిటల్ లో ప్రస్తుతం ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం గురించి కూడా కృష్ణంరాజు సాయిధరమ్తేజ్ కుటుంబ సభ్యులను వాకబు చేసి వివరాలు తెలుసుకున్నారు అని ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే సాయి ధరంతేజ్ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం అని కృష్ణంరాజు చెప్పారని ప్రకటనలో పేర్కొన్నారు.

సాధారణ చెకప్
అయితే త్వరలో లండన్ వెళ్లాల్సి ఉండడంతో ఆ పర్యటన కోసం సాధారణ చెకప్ చేయించుకోవడం కోసం ఆయన అపోలో హాస్పిటల్ కి వెళ్లారని ఆయన ఆఫీస్ అధికారిక ప్రకటనలో పేర్కొంది.. దీంతో ఒకపక్క మీడియాలో శస్త్ర చికిత్స అంటూ స్క్రోలింగ్ రావడం ఆయన ఆఫీస్ నుంచి అలాంటిదేమీ లేదని సమాధానం ఇవ్వడంతో అసలు ఏం జరిగింది అనే విషయం మీద సందిగ్ధత కొనసాగుతోంది.
Recommended Video

ఆ సినిమాలో కీలక పాత్ర
ఇక ప్రస్తుతం కృష్ణంరాజు చాలా రోజుల నుంచి సినిమా నటుడిగా కనిపించడం లేదు. అడపాదడపా నిర్మాతగా ఆయన సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాధేశ్యాం అనే సినిమా రూపొందుతుండగా ఆ సినిమాలో ఆయన ఒక స్వామీజీ పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే తన సొంత గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ మీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
వయోభారం రీత్యా ఆయన నిర్మాణ పనులలో భాగంగా కాకపోయినా ఆయన కుమార్తె ప్రసీద నిర్మాణానికి సంబంధించిన బాధ్యతలు స్వీకరించి తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటున్నారు. ఆమె సినిమా నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











