రెబల్ స్టార్ కృష్ణంరాజుకు ప్రమాదం.. సర్జరీ చేసిన వేలు తొలగించిన వైద్యులు.. ఏమైందంటే?

టాలీవుడ్ కు సంబంధించిన షాకింగ్ న్యూస్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్ సీనియర్ హీరో ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ గా ఉన్న ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజుకు ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనకు సర్జరీ కూడా చేశారని తెలుస్తోంది. అసలు కృష్ణం రాజుకు ఏమైంది? ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు ? అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 కాలుజారి కింద పడ్డారని

కాలుజారి కింద పడ్డారని

నటుడు కృష్ణంరాజు ప్రమాదానికి గురయ్యారని తెలుస్తోంది. నిజానికి సెప్టెంబర్ నెలలో ఆయన బాత్రూంలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడ్డారని ప్రచారం జరిగింది. ఆ సమయంలో తుంటి భాగానికి ఫ్రాక్చర్ కాగా అపోలో వైద్యులు దానికి శస్త్రచికిత్స చేశారు అని కూడా అన్నారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని ఆయన శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది.

 లండన్ వెళ్లాల్సి ఉండడంతో

లండన్ వెళ్లాల్సి ఉండడంతో

ఆ వెంటనే కృష్ణంరాజు కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. కృష్ణంరాజు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని ఆయన ఎప్పటిలాగే రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం అపోలో హాస్పిటల్ కు వచ్చారు అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. లండన్ వెళ్లాల్సి ఉండడంతో ఆ పర్యటన కోసం సాధారణ చెకప్ చేయించుకోవడం కోసం ఆయన అపోలో హాస్పిటల్ కి వెళ్లారని ఆయన ఆఫీస్ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

మరోమారు కాలుజారి

మరోమారు కాలుజారి


ఆ విషయం పక్కన పెడితే ఆయన ఇటీవ‌ల మరోమారు కాలుజారి ప‌డ్డారని, ఈ క్రమంలో మరో చిన్న స‌ర్జ‌రీ అవ‌స‌రమైందని అంటున్నారు. టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు ఆయనకు ఇప్పటికే హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో స‌ర్జ‌రీ పూర్త‌య్యింది. ఆయ‌న డిశ్చార్జీ కూడా ఆయ్యారని అంటున్నారు.

కాలి వేలుని తొల‌గించడంతో

కాలి వేలుని తొల‌గించడంతో


అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే స‌ర్జ‌రీలో భాగంగా ఆయ‌న కాలి వేలుని తొల‌గించాల్సివ‌చ్చింద‌ని అంటున్నారు. కాలు వేలు అయితే తొలగించారు కానీ ప్ర‌స్తుతం కృష్ణంరాజు క్షేమంగా ఉన్నారని అంటున్నారు. నిజానికి కృష్ణంరాజు చాలా రోజుల నుంచి సినిమాలో నటుడిగా కనిపించడం లేదు. అడపాదడపా నిర్మాతగా ఆయన సినిమాలు చేస్తున్నారు.

 పరమహంస అనే పాత్రలో

పరమహంస అనే పాత్రలో


ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న రాధేశ్యాం అనే సినిమాలో రూపొందుతుండగా ఆ సినిమాలో ఆయన ఒక పరమహంస అనే ఒక సాధువు పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన తన సొంత గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ మీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వయోభారం రీత్యా ఆయన నిర్మాణ పనులలో భాగంగా కాకపోయినా ఆయన కుమార్తె ప్రసీద నిర్మాణానికి సంబంధించిన బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఊవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ లతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు.

ప్రమోషన్స్ కి వెళ్ళాలనుకున్నా

ప్రమోషన్స్ కి వెళ్ళాలనుకున్నా


ఇక ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ రాధే శ్యామ్ మార్చి 11న విడుదల అవుతోంది. ఇప్పటికే ప్రభాస్ సహా టీమ్ అంతా భారతదేశంలోని అన్ని ముఖ్య నగరాల్లో ప్రమోషన్స్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో తాను కూడా పాల్గొనాల‌ని కృష్ణంరాజు భావించారు. కానీ ఆరోగ్యం స‌హ‌క‌రించ‌ లేదు. ఇక ఎనిమిదో తేదీన ప్రభాస్ అలాగే సినిమా యూనిట్ ప్రమోషన్స్ కోసం కేరళ వెళ్ళింది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X