For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల్లు అర్జున్, ఎన్టీఆర్ ల గురించి కమెడియన్ ఆసక్తికర కామెంట్స్.. సచిన్ కి తక్కువ కాదు, ఇండియాలోనే లేడు అంటూ!

  |

  తెలుగు సినిమాల్లో డాన్స్ గురించి మాట్లాడాలి అంటే ఒకప్పుడు చిరంజీవి గురించి ప్రస్తావించేవారు. కానీ ఇప్పటి తరంలో అల్లు అర్జున్, ఎన్టీఆర్ మధ్య ఈ పోటీ నెలకొని ఉంది. అల్లు అర్జున్ బాగా డాన్స్ చేస్తాడని అల్లు అర్జున్ ఫ్యాన్స్ లేదు ఎన్టీఆర్ బాగా డాన్స్ చేస్తాడని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఈ హీరోలు ఇద్దరూ అద్భుతమైన డాన్సర్లే అని ప్రేక్షకులు భావిస్తారు. తాజాగా వీరిద్దరి గురించి ఒక కమెడియన్ ఆసక్తికరంగా స్పందించాడు. ఆ కమెడియన్ మరెవరో కాదు మధు నందన్, ఆయన ఏమన్నాడు అనే వివరాల్లోకి వెళితే

  ఇరవైఏళ్ళ క్రితమే

  ఇరవైఏళ్ళ క్రితమే

  అప్పుడెప్పుడో 2001లో నువ్వు నేను సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైన మధునందన్ అడపాదడపా సినిమాల్లో నటిస్తూ వచ్చాడు. మొదటి సినిమా తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకుని నిన్నే ఇష్టపడ్డాను అనే సినిమా చేశారు. ఆ తర్వాత మరో సంవత్సరం గ్యాప్ తో రాజమౌళి సై సినిమా చేశారు. తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకుని ఒక వి చిత్రం అనే సినిమాలో నటించి ఆ తర్వాత మరో సంవత్సరం తర్వాత కాజల్ మొదటి సినిమా లక్ష్మీ కళ్యాణంలో కనిపించాడు. అయితే 2012లో నితిన్ హీరోగా వచ్చిన ఇష్క్ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు దక్కింది.

  వరుస సినిమా అవకాశాలు

  వరుస సినిమా అవకాశాలు

  ఆ తర్వాత 2013లో గుండెజారి గల్లంతయ్యిందే సినిమా చేశాక ఆయనకు మరిన్ని అవకాశాలు దక్కాయి. 2014లో దాదాపు అరడజనుకు పైగా సినిమాల్లో నటించాడు. ఇక అప్పటి నుంచి ఆయన ఏడాదికి నాలుగైదు సినిమాల్లో కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన పాల్గొన్నాడు. సదరు ఇంటర్వ్యూలో ఒక రాపిడ్ ఫైర్ రౌండ్ లో భాగంగా టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోలతో సంబంధించి కొన్నిఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

  చిరంజీవి నభూతో నభవిష్యత్

  చిరంజీవి నభూతో నభవిష్యత్

  ముందుగా చిరంజీవి గారి విషయానికి వస్తే నభూతోనభవిష్యత్ అని చెప్పుకొచ్చాడు. ఇక వెంకటేష్ గారి విషయానికొస్తే ది ఫన్నీయస్ట్ హీరో ఇన్ టాలీవుడ్ అని, బాలకృష్ణ గారి విషయానికొస్తే లెజెండ్ అని, నాగార్జున గారు విషయానికి వస్తే ఎవర్గ్రీన్ అని చెప్పుకొచ్చాడు. ఇక పవన్ కళ్యాణ్ అంటే చరిత్రని, విజయ్ దేవరకొండ ప్రజెంట్ సూపర్ స్టార్ అని చెప్పుకొచ్చాడు. మహేష్ బాబు ఏమో ఆలిండియా అందగాడు అని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  బన్నీ -సచిన్ సేమ్ టు సేమ్

  బన్నీ -సచిన్ సేమ్ టు సేమ్


  ఇక డ్యాన్స్ విషయంలో తెలుగువారందరికీ గర్వకారణం అయిన అల్లు అర్జున్, ఎన్టీఆర్ గురించి ఆసక్తికరంగా స్పందించాడు. అల్లు అర్జున్ విషయానికొస్తే ఆయన చాలా హార్డ్ వర్కర్ అని ఆయన పెట్టే డెడికేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ కి మేన మామ చిరంజీవి హార్డ్ వర్కింగ్ నేచర్ రావడంతో చాలా కష్టపడి పని చేస్తాడు అని చెప్పుకొచ్చారు. అంతేకాక క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ ఎలాగో అల్లు అర్జున్ కూడా అలాగే అని ఆయన అన్నాడు. మైదానంలో ఉన్నంతసేపు సచిన్ ఎంత డెడికేటెడ్ గా ఆడతాడో బన్నీ కూడా సెట్లో ఉన్నంత సేపు అలాగే ఉంటాడు అని అని చెప్పుకొచ్చాడు.

  #17YearsOfAarya : Allu Arjun ఎమోషనల్, లో బడ్జెట్ హెవీ ప్రాఫిట్స్ ! || Filmibeat Telugu
  ఎన్టీఆర్ సింగిల్ పీస్

  ఎన్టీఆర్ సింగిల్ పీస్

  ఇక ఎన్టీఆర్ గురించి స్పందిస్తూ ఎన్టీఆర్ లాంటి నటుడు ఇండియాలోనే లేడని అన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పుకొచ్చారు. ఇండియా మొత్తం మీద ఎన్టీఆర్ లాగా నటించగలిగిన నటుడు మరొకరిని తాను చూడలేదని ఆయన అన్నారు. పౌరాణికం మొదలు సోషల్ సినిమాల దాకా ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతూ గల నటుడు ఎన్టీఆర్ ఒక్కరేనని ఆయన చెప్పుకొచ్చాడు.

  English summary
  Actor Madhunandan has been in the industry for close to two decades. In his cinematic journey, he has acted with numerous actors and star heroes. Recently in an interview madhunandan commented on all the tollywood stars in rapid fire questions.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X