Manchu Manoj కు కరోనావైరస్ పాజిటివ్.. దేశవ్యాప్తంగా భారీగా ఒమిక్రాన్ కేసులు!
దేశవ్యాప్తంగా కరోనావైరస్ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో పాక్షికంగా లాక్‌డౌన్స్, కర్ఫ్యూలు విధిస్తూ వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కరోనావైరస్ పరిస్థితులు సినీ నటులకు, పరిశ్రమను ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే తాజాగా టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌కు కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో సినీ వర్గాలు ఆందోళన చెందారు. తనకు కరోనా సోకినట్టు స్వయంగా సోషల్ మీడియా ద్వారా మనోజ్ వెల్లడిస్తూ..
కొద్ది రోజులుగా జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులతో బాధపడుతున్న మనోజ్ రోగ నిర్ధారణ పరీక్షలు జరిపించుకోగా కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. గతవారం రోజుల్లో ఎవరైతే నన్ను కలిశారో వారందరూ వెంటనే పరీక్షలు చేయించుకోండి. అందుకనుగుణంగా జాగ్రత్తలు తీసుకోండి. నా గురించి ఆందోళన చెందకండి. మీ ప్రార్థనలు, ఆశీర్వాదాలతో నేను పూర్తిగా కోలుకొంటున్నాను. మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, నర్సులకు నా ధన్యవాదాలు అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు.

ఇటీవల కాలంలో కమల్ హాసన్‌తోపాటు పలువురు నటీనటులు కరోనావైరస్ బారిన పడ్డారు. అమెరికాలో పర్యటించి చెన్నైకి చేరుకొన్న వెంటనే కమల్‌కు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఇక బాలీవుడ్‌లో అర్జున్ కపూర్, కరీనాకపూర్, అమృతా అరోరా, అన్షులా కపూర్, కరణ్ బూలానీ లాంటి తారలు కరోనావైరస్ కాటుకు గురయ్యారు. తాజాగా టాలీవుడ్‌లో మనోజ్ మంచు కూడా కరోనావైరస్ బారినపడటంతో సినీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు మంగళవారం రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. అమెరికాలో కరోనావైరస్ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఒకే రోజు సుమారు 550000 కేసులు నమోదయ్యాయి. యూకేలో 1.30 లక్షలు, ఫ్రాన్స్‌లో 1.80 లక్షలు, పోర్చుగల్ 17 వేలు, గ్రీస్ 21 వేల కేసులు నమోదయ్యాయి.


Click it and Unblock the Notifications











