Pushpa 2 మూవీలో అల్లు అర్జున్‌తో.. మనోజ్ బాజ్‌పేయ్ క్లారిటీ ఏమిటంటే?
దేశం గర్వించ దగిన నటుల్లో మనోజ్ బాజ్‌పేయ్ ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. బండిట్ క్వీన్‌తో మొదలుపెట్టిన ప్రయాణంలో ద్రోహ్‌కాల్, గ్యాంగ్ ఆఫ్ వాస్సేపూర్, దౌడ్, సత్య, ప్రేమ కథ, జుబేదా, గ్యాంగ్స్ వాసేపూర్, గుల్మోహర్, సీర్ఫ్ ఏక్ బందా కాఫీ హై సినిమాల వరకు తన అద్బుతమైన నటనతో ఆకట్టుకొన్నారు. అయితే ఇటీవల ఆయన నటించిన సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై సినిమా జీ5 ఓటీటలో అద్బుతమైన రెస్పాన్స్‌ను కూడగట్టుకొంటున్నది. ఈ నేపథ్యంలో ఫిల్మ్ బీట్ మీడియాతో మనోజ్ బాజ్‌పేయ్ మాట్లాడుతూ...
సిర్ఫ్ ఏక్ బందా హై సినిమాలోని నా పాత్రను ఎలివేట్ చేయడానికి, బాగా ఫెర్ఫార్మెన్స్ చేయడానికి స్క్రిప్టును చాలా సార్లు చదివాను. ముఖ్యమైన పాయింట్స్‌ను నోట్ చేసుకొన్నాను. పీసీ సోలంకి పాత్ర ఎలా ఉండాలనే విషయంలో రీసెర్చ్ చేశాను. సోలంకి జీవితానికి సంబంధించిన అనేక ప్రశ్నలకు సమాధానాలు రాసుకొన్నాను అని మనోజ్ బాజ్‌పేయ్ చెప్పారు.
సిర్ఫ్ ఏక్ బందా హై సినిమాలో నా క్యారెక్టర్‌ను మనసులో పెట్టుకొని ఆ పాత్రలో ఒదిగిపోయాను. ఆ పాత్ర ఎలా హావభావాలు ప్రకటించాలి? అతడి యాటిట్యూడ్ ఎలా ఉండాలి? ఆ పాత్ర కోర్టులో ఎలా మాట్లాడాలి అనే విషయాల గురించి అవగాహన చేసుకొన్నాను. సొలంకి క్రాఫ్ ఎలా ఉండాలి? స్కూటర్ ఎలా నడపాలి అనే విషయాలపై క్షుణ్ణంగా ఆలోచించాను అని మనోజ్ బాజ్‌పేయ్ పేర్కొన్నారు.
సిర్ఫ్ ఏక్ బందా హై సినిమాలోని క్లైమాక్స్‌లో రామాయణం ఎపిసోడ్ చాలా కీలకమని భావించాం. రచయిత ఐడియా ప్రకారం మేము ఆ సీన్ చేశాం. ఆ ఎపిసోడ్‌ను మూడు భాగాలుగా చేశాం. మొదట ఒక లాయర్‌గా మాట్లాడించాలని ప్లాన్ చేశాం. ఆ తర్వాత రామాయణం కథ చెప్పే వ్యక్తిగా మార్చాం. ఒక మంచి విషయాన్ని, దేవుడి గురించి, రామాయణం గురించి చెప్పేటప్పుడు కళ్లు మూసుకొని ఓ భక్తి భావనతో చెప్పాను. మూడో పార్ట్ విషయానికి వస్తే.. అమ్మాయి పడే వేదన, బాధ గురించి హైలెట్ చేయాలని అనుకొన్నాం అని మనోజ్ బాజ్‌పేయ్ చెప్పారు.

ఇక పుష్ప 2 సినిమాలో తాను నటిస్తున్నట్టు ఓ వార్తను నేను కూడా విన్నాను. కానీ అది నిజం కాదు. గతంలో నేను అల్లు అర్జున్‌తో హ్యాపీ చిత్రంలో నటించాను. అతడితో నటించడం గొప్ప అనుభూతి. కొన్ని సినిమాలు తెలుగులో చేసిన తర్వాత మళ్లీ చేయలేదు. అల్లు అర్జున్‌తో ప్రస్తుతం టచ్‌లో లేను.ఇక ముందు ఏదైనా ఛాన్స్, మంచి ఆఫర్ వస్తే తప్పకుండా నేను తెలుగులో నటించడానికి నేను సిద్దం అని మనోజ్ బాజ్‌పేయ్ చెప్పారు.


Click it and Unblock the Notifications











