twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భారీగా జనంతో కోర్టు ముందు మోహన్ బాబు.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను.. కాంట్రవర్సీ అంటూ..

    |

    టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ఆంధ్రప్రదేశ్ లోనే తిరుపతి కోర్టులో హాజరైన విధానం మీడియా లో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఇంత హఠాత్తుగా ఎందుకు హాజరయ్యారు అనే విషయంలో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. అయితే మోహన్ బాబుతో పాటు భారీ స్థాయిలో ఆయన వెనుక కొంత మంది జనాలు కూడా రావడంతో కోర్టు ప్రాంగణం మొత్తం కిక్కిరిసి పోయింది. మోహన్ బాబుతో పాటు వారి కొడుకులు కూడా కోర్టులో హాజరయ్యారు. అయితే ఆయన ఎందుకు హాజరయ్యారు ఎలాంటి క్లారిటీ ఇచ్చారు అనే వివరాల్లోకి వెళితే..

    కోర్టు ముందు మోహన్ బాబు

    కోర్టు ముందు మోహన్ బాబు

    నటుడు మోహన్ బాబు తిరుపతిలోని కోర్టుకు హాజరు కావడంతో ఒకసారిగా అందుకు సంబంధించిన వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆయనతోపాటు కొంతమంది శ్రీ విద్యానికేతన్ విద్యార్థులు అలాగే అభిమానులు కూడా కోర్టు పరిధిలో భారీ సంఖ్యలో రావడంతో ఒక్కసారిగా ఆ నలుమూలల ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్ చోటుచేసుకుంది. పోలీసులు జనాలను క్లియర్ చేయడానికి చాలా సమయం పట్టింది.

     ఆ కేసు విషయంలో..

    ఆ కేసు విషయంలో..

    ఇక మోహన్ బాబు ఎందుకు కోర్టులో హాజరయ్యారు అనే విషయంలోకి వెళితే.. 2019లో మార్చి 22న మోహన్ బాబు సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే ఆంక్షలు విధించినప్పటికీ కూడా ఆయన ఎన్నికల కోడ్ ను ఉల్లగించారు అని కేసు నమోదు అయింది. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం మోహన్ బాబు తిరుపతి మదనపల్లి జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేసిన విషయం తెలిసిందే.

     ఆ కారణంగా కేసు నమోదు

    ఆ కారణంగా కేసు నమోదు

    సార్వత్రిక ఎన్నికల కోడ్ ఉల్లంఘన కారణంగా మోహన్ బాబుపై అలాగే ఆయన కుమారులు మంచు విష్ణు మంచు మనోజ్ పై శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల యాజమాన్యంపై కూడా కేసు నమోదు అయింది. జనాలకి ఇబ్బంది కలిగించేలా రోడ్డుపై ఎలాంటి అనుమతులు లేకుండా ధర్నా చేశారు అని వాహనదారులకు ఇబ్బంది కలిగించి అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యేలా చేశారు అని పోలీసుల నుంచి అనుమతి కూడా తీసుకోలేదని చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.

    పాదయాత్ర తరహాలో

    పాదయాత్ర తరహాలో

    అయితే ఆ కేసు లో భాగంగానే నేడు మోహన్ బాబు తన ఇద్దరు కొడుకులతో కలిసి తిరుపతి కోర్టులో హాజరయ్యారు. అయితే ఆయన ఎన్టీఆర్ సర్కిల్ దగ్గరకు రాగానే కారు దిగి నడుచుకుంటూ పాదయాత్ర తరహాలో కోర్టుకు వెళ్లడం అక్కడ హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఈ క్రమంలో మోహన్ బాబుకు మద్దతుగా భారత జనతా పార్టీ నేత కోలా ఆనంద్ అలాగే కొంతమంది వైసీపీ నేతలు కూడా వచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి.

    మోహన్ బాబు వివరణ

    మోహన్ బాబు వివరణ

    ఇక కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత మోహన్ బాబు ఈ విధంగా వివరణ ఇచ్చారు. 'కోర్టుకు రమ్మని పిలిచారు. అలాగే పేపర్ కూడా ఇచ్చారు. నేను సంతకం కూడా పెట్టడం జరిగింది. దీంతో వాయిదా వేశారు. తరువాత నేను బయటకు వచ్చేసాను. అయితే నేను ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా అది కాంట్రవర్సీ అవుతుంది.

    నిజానికి నాకు ఎలాంటి సమన్లు కూడా అందలేదు కేవలం. న్యాయాధిపతి రమ్మని పిలిస్తే నేను వచ్చాను. ఆయన సమక్షంలోనే సమన్లపై సంతకం కూడా పెట్టాను. ఇంతకంటే ఈ విషయం గురించి తను ఏమి మాట్లాడలేను అని వివరణ ఇచ్చారు.

    English summary
    Actor mohan babu clarification on tirupati court case..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X