టీవీ నటుడి కంటికి తీవ్ర గాయం.. దేవుడి దయవల్ల నా చూపు నిలిచింది!
బుల్లి తెరపై నటుడిగా రాణిస్తున్న మోహిత్ రైనా గాయాపడ్డాడు. లక్నో సమీపంలో షూటింగ్ లో భాగంగా మోహిత్ కు కంటి పైభాగంలో తీవ్ర గాయమైంది. హుటాహుటిన అతడికి ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు కంటి పైభాగంలో కుట్లు వేశారు. ఈ ఘటన గురించి మోహిత్ మాట్లాడాడు. తాను ప్రస్తుతం క్షేమంగా ఉన్నానని మోహిత్ తెలిపాడు.
యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా గాయపడ్డా. కంటికి గాయమైంది. వెంటనే ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు చికిత్స చేశారు. దేవుడి దయవలన నా కంటి చూపు నిలిచింది అని పేర్కొన్నాడు. ఒక రోజు విశ్రాంతి తీసుకున్న తరువాత తిరిగి షూటింగ్ లో పాల్గొన్నానని మోహిత్ తెలిపాడు.

బుల్లి తెరపై ప్రసారమయ్యే మహాదేవ్ సీరియల్ తో మోహిత్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సిరియాలో మొహిన్ మాహా శివుడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం తప్ప మిగిలిన షూటింగ్ మొత్తం చాలా ఎంజాయ్ చేసానని మోహిత్ తెలిపాడు. మోహిత్ ప్రస్తుతం పలు టివి కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నాడు.


Click it and Unblock the Notifications











