శ్రీదేవితో పెళ్లి, ఆమెతో ఎఫైర్‌పై మురళి మోహన్.. మడతేశారు, యవ్వనం కాటేసింది అంటూ!

మురళీ మోహన్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని నటుడు. హీరోగా, నటుడిగా దాదాపుగా 350కిపైగా చిత్రాలతో అలరించారు. 80వ దశకంలో కుటుంబ కథా చిత్రాలతో ఫ్యామిలీ ప్రేక్షకులను మెప్పించిన హీరో. తెలుగు సినిమా పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన మురళీ మోహన్ నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఎంతో ఎదిగారు. గత కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మురళీ మోహన్ సినీ ఇండస్ట్రీలో శ్రీరామచంద్రుడు అనే క్లీన్ ఇమేజ్ తెచ్చుకున్నారు. అలాంటి ఆయన శ్రీదేవితో పెళ్లి వంటి ఆసక్తికర విషయాలను తాజాగా చెప్పుకొచ్చారు.

మడత వేశారని: 84 ఏళ్ల మురళీ మోహన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఆయనతో యాంకర్ చమత్కారంగా మాట్లాడారు. "మీ సుధీర్ఘ ప్రయాణంలో ఇప్పటివరకు ఎవ్వరితో ఎప్పుడూ చెప్పని రహస్యాలు నాతో చెప్పేసేయండి" అని యాంకర్ అంటే "నా జీవితం తెరిచిన పుస్తకం" అని మురళీ మోహన్ అన్నారు. "తెరిచిన పుస్తకం అని మీరంటారు.. కానీ, కొన్ని పేజీలు మడత వేశారని మేం చెబుతాం. నిజం చెప్పండి" అని యాంకర్ అన్నారు.

Murali Mohan

సర్టిఫికేట్ ఇచ్చారు:"నాకు ఏ లవ్ వ్యవహారాలు లేవు. అండర్ హ్యాండ్ డీలింగ్స్ కూడా లేవు" అని మురళీ మోహన్ తెలిపారు. "ఏం లేవని అంటారు. మరి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు దీపని అలా అజ్ఞాతంలో ప్రేమించారట కదా" అని యాంకర్ అనడంతో మురళీ మోహన్ పెద్దగా నవ్వేశారు. "మా ఇండస్ట్రీలో శ్రీరామచంద్రుడు ఎవరైనా ఉన్నారంటే అది మా మురళీ మోహన్ అని నాగేశ్వర రావు గొప్పగా చెప్పారు. ఆయన అలా సర్టిఫికేట్ ఇచ్చాకా మరింత జాగ్రత్తగా ఉన్నాను" అని మురళీ మోహన్ తెలిపారు.

Murali Mohan

ఇద్దరం కలిసి: "అయితే మిమ్మల్ని ఇరికించేశారన్నమాట. మీరు ఆయనకు పోటీ లేకుండా" అని యాంకర్ అనడంతో "ఇది బాగుంది" అంటూ మురళీ మోహన్ నవ్వేశారు. మరి జయచిత్రతో ఎఫైర్ విషయం ఏంటీ అని అడగడంతో.. "మేం ఇద్దరం కలిసి ఫస్ట్ మూవీ యవ్వనం కాటేసింది చేశాం. నా చేయి పట్టుకుని మీరు పెళ్లి చేసుకుంటున్నారా అని అడిగింది. ఆమె ఎవరో గుర్తు లేదు. అంతకు మించి ఏం లేదు" అని మురళీ మోహన్ వెల్లడించారు.

Murali Mohan

ఎందుకు నచ్చానో:ఇక శ్రీదేవితో పెళ్లిపై "ఎందుకు నచ్చానో తెలియదు కానీ, కుర్రాడు బుద్దిమంతుడిలా ఉన్నాడు. బాగున్నాడు. ఇలాంటి వాడు మా అమ్మాయికి చేస్తే చాలా బాగుంటుందని శ్రీదేవి తల్లికి ఆలోచన వచ్చింది. అంతకు ముంచి ఏం లేదు" అని మురళీ మోహన్ వివరణ ఇచ్చారు. 84 ఏళ్లు వచ్చినా ఇలా ఫిట్ గా ఉండటానికి కారణం ఏంటీ అని యాంకర్ క్వశ్చన్ చేశారు.

Murali Mohan

బ్రదర్ లా ఉన్నానని: "పాజిటివ్ గా ఆలోచించడమే. ఏదో చేసేయాలి. అందరి కంటే ముందుండాలి అని నేను అనుకోను. నేనో సగటు మనిషిని. సగటు నటుడిని మాత్రమే అనుకుంటాను" అని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. "మరి సినిమాలు ఎందుకు మానేశారు" అన్నదానికి "నేను హీరోయిన్ కు తండ్రిగా కాకుండా బ్రదర్ లా కనిపిస్తున్నాను అని ఎవరూ తీసుకోవట్లేదు" అన్న అర్థంలో మురళీ మోహన్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X