చిరంజీవి విలన్ కాదు.. ఇండస్ట్రీకి మొగుడు.. మురళీ మోహన్ షాకింగ్ కామెంట్స్
తెలుగు సినిమా పరిశ్రమలో హీరోగా, నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, నిర్మాతగా రాణించిన సినీ ప్రముఖుల్లో ఒకరు మురళీ మోహన్. ఏలూరులో చదువుకొనే రోజుల్లో కృష్ణ, విజయబాపినీడు నాకు స్నేహితులు. వారు నన్ను సినిమా ఇండస్ట్రీలోకి రమ్మని ఆహ్వానించారు. కానీ ఓ రోజు క్రాంతి కుమార్, హనుమాన్ ప్రసాద్ నన్ను మద్రాస్‌కు తీసుకెళ్లి మేకప్ టెస్ట్ చేయించారు. ఆ సందర్భంగా తీసిన ఫోటోలను నిర్మాత అట్లూరి పూర్ణచందర్ రావు చూసి..జగమే మాయ చిత్రంలో హీరోగా అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి దాదాపు 350 చిత్రాల్లో నటించారు. ఆ నటుడిగా, బిజినెస్‌మ్యాన్‌గా, నిర్మాతగా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా మురళీమోహన్‌కు పద్మశ్రీ అవార్డు లభించింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు విషయాలను పంచుకొన్నారు.
నాకు నా తండ్రి పెట్టిన అసలు పేరు రాజా రామ్మోహన్ రాయ్. ఆ పేరు పలకడం కష్టంగా ఉందని నన్ను రాజాబాబు అని పిలిచే వారు. సినిమా పరిశ్రమకు వెళ్లిన సమయంలో అప్పటికే రాజాబాబు ఉండటంతో నా పేరును మురళీ మోహన్‌గా మార్చారు. ఆ పేరుతోనే ఎన్నో పాత్రలను, ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకుల ఆదరణకు లోనయ్యాను. పద్మశ్రీ అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉన్నాను అని అన్నారు.

పద్మశ్రీ అవార్డు ఆలస్యంగా వచ్చినప్పటికీ.. లేటేస్ట్‌గా వచ్చిందని భావిస్తాను. ఈ అవార్డులు దేశవ్యాప్తంగా ప్రతిభను, కళాకారులు చేసిన సేవలకు గుర్తింపుగా ఇస్తారు. నేను ముంబై, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో తెలియకపోవచ్చు. ఏది ఏమైనా ఆలస్యంగా వచ్చినా నాకు ఎలాంటి సంతృప్తి లేదు. నాకు ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపుకు చాలా సంతోషంగా ఉన్నాను అని మురళీ మోహన్ అన్నారు.
పద్మశ్రీ అవార్డులు ప్రకటించే రోజున ఉదయం నాకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్‌లో నా పేరు, నా తండ్రి పేరు, నా పుట్టిన ప్రదేశం పేరును అడిగారు. దాంతో నాకు అనుమానం వచ్చి మీరు ఎవరు? నా వివరాలు ఎందుకు అడుగుతున్నారు అని ప్రశ్నిస్తే.. ఢిల్లీలోని హోంశాఖ నుంచి కాల్ చేస్తున్నాం. మీకు పద్మశ్రీ అవార్డు ఇస్తే తీసుకొంటారా? అని అడిగారు. దాంతో నేను తీసుకోవడానికి సిద్దంగా ఉన్నాను అని చెప్పాను. అయితే ప్రభుత్వం ప్రకటించే వరకు ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు అని అన్నారు. దాంతో నా భార్యకు కూడా ఈ విషయం చెప్పలేదు. సాయంత్రం మీడియాలో ప్రకటన వచ్చిన తర్వాత అందరూ కంగ్రాట్స్ చెబుతుంటే.. టెలివిజన్‌లో వార్తలు చూసి ధృవీకరించుకొన్నాను. ఆ తర్వాత నా భార్య, కొడుకు, కోడలికి చెప్పాను. ఆ సంతోషాన్ని దాచుకోవడానికి చాలా కష్టపడ్డాను అని మీడియాకు వివరించారు.
మెగాస్టార్ చిరంజీవితో నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. నన్ను ప్రేమగా అన్నయ్య అనిపిస్తారు. మొదటి సినిమా మనవూరి పాండవులు సినిమా సమయంలో కృష్ణంరాజు, నేను, చిరంజీవి, ప్రసాద్ బాబు అందరం కలిసి నటించాం. అప్పటి నుంచి ఆయన నన్ను అన్నయ్య అని పిలిచే వారు. ఆ సమయంలో కృష్ణం రాజు గారు నాతో మాట్లాడుతూ.. చిరంజీవి గొప్ప నటుడు.. విలన్ అవుతాడు. అతడి కళ్లు చూశావా? అని అన్నారు. అయితే అతడు విలన్ అవ్వడం ఏమిటి? ఇండస్ట్రీకి మొగుడు అవుతాడు అని నేను జోస్యం చెప్పాను. అది ముమ్మాటికి నిజం చేశారు అని మురళీ మోహన్ తెలిపారు.


Click it and Unblock the Notifications