తండ్రి నాగార్జున బాటలోనే నాగచైతన్య.. విడాకుల అనంతరం కొత్త నిర్ణయం?

అక్కినేని నాగార్జున నట వారసుడిగా జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య అక్కినేని హీరో అనే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ కూడా క్రియేట్ చేసుకున్నాడు. హీరోయిన్ సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య... గత ఏడాది అక్టోబర్ లో విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించారు. అయితే విడాకులు తీసుకుని నెలలు గడుస్తున్నా వారి విడాకులకు ప్రకటనకు అసలు కారణం ఏంటో ఇంతవరకు ఎవరికీ తెలియదు. వరుస సినిమాలు ఒప్పుకుంటూ దూసుకుపోతున్న నాగచైతన్య తండ్రి నాగార్జున బాటలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు

తండ్రికి తగ్గ తనయుడిగా

తండ్రికి తగ్గ తనయుడిగా

విడాకుల ప్రకటన అనంతరం నాగ చైత‌న్య బహుశా ఆ బాధ నుంచి బయట పడేందుకో ఏమో తెలియదు కానీ కెరీర్లో ఫుల్ బిజీగా మారారు. ఒక‌వైపు వరుస సినిమాలు చేస్తూ మ‌రోవైపు వెబ్ సిరీస్‌లు కూడా ఒప్పుకుంటూ ముందుకు వెళుతున్నారు. మూస పద్దతిలో హీరోయిజానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు.

రెస్టారెంట్ మూసి వేసి

రెస్టారెంట్ మూసి వేసి

అయితే తన తండ్రి మాదిరిగానే కేవలం సినిమాలకే పరిమితం కాకుండా వ్యాపార‌వేత్త‌గా రాణించాల‌ని భావిస్తున్న నాగ చైత‌న్య‌ ఇప్పుడు ఫుడ్ బిజినెస్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. అక్కినేని ఫ్యామిలీ గతంలో ఎన్ గ్రిల్ అనే ఒక రెస్టారెంట్ ను నడిపింది. ఆ తరువాత ఏమైందో ఏమో కానీ ఆ రెస్టారెంట్ మూసి వేశారు.

‘షోయు' పేరుతో

‘షోయు' పేరుతో

ఇప్పుడు నాగచైతన్య హైదరాబాద్‌లో 'షోయు' పేరుతో కొత్త ఫుడ్ బిజినెస్ మొదలు పెట్టారు. ఆసియా ఖండంలో దొరికే మంచి ఫుడ్ ఐటమ్స్ మొత్తం ఈ 'షోయు' రెస్టారెంట్ ద్వారా భోజన ప్రియులకి అందించనున్నారు. తాజాగా తన రెస్టారెంట్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు కూడా.

ఇప్పటికే విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, బన్నీ, సందీప్ కిషన్ లాంటి వాళ్ళు ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలో నాగచైతన్య ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన అంశం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అన్నట్టు బన్నీ, సందీప్ కిషన్ ఇద్దరూ కూడా ఇప్పటికే ఫుడ్ బిజినెస్ లో ఉన్నారు.

‘థాంక్యూ' సినిమా

ఇక నాగచైతన్య చేస్తున్న సినిమాల విష‌యానికి వ‌స్తే గ‌త ఏడాది ల‌వ్ స్టోరీ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన నాగ చైత‌న్య ఈ ఏడాది సంక్రాంతికి తండ్రి నాగార్జునతో కలిసి నటించిన బంగార్రాజు సినిమాతో వచ్చి మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు చైతు. ఇక దిల్ రాజు నిర్మాణంలో విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చైతు-రాశిఖన్నా జంటగా నటించిన 'థాంక్యూ' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది.

దూత అనే వెబ్ సిరీస్ లో

దూత అనే వెబ్ సిరీస్ లో

ఇక నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్‌తో కలిసి నటించిన లాల్ సింగ్ చద్దా చిత్రం సమ్మర్ కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దూత అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో ఆయన ఆత్మలతో మాట్లాడే వ్యక్తి పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X