జానీ మాస్టర్‌కు ప్రభుదేవా, లారెన్స్ రేంజ్.. మెగా బ్రదర్ నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా 'హిప్పీ' ఫేమ్ దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా సుజి విజువల్స్ బ్యానర్‌పై మురళిరాజ్ తియ్యాన దర్శకత్వంలో నిర్మాత కే వెంకటరమణ నిర్మిస్తున్న చిత్రం ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ఈ ప్రారంభ వేడుకకు ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్, నిర్మాత లగడపాటి శ్రీధర్, ప్రముఖ నటుడు నాగబాబు, యాంకర్ ప్రదీప్ హాజరయ్యారు. తొలి షాట్‌కు దర్శకత్వం వహించిన వీవీ వినాయక్ క్లాప్ కొట్టారు. నటుడు నాగబాబు కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

యువ హీరోయిన్ సంజనా లేటేస్ట్ ఫోటో షూట్.. వైరల్ పిక్స్

ఈ సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు గారు మాట్లాడుతూ.. జానీ మాస్టర్ మా అందరికీ, ముఖ్యంగా మా మెగా ఫామిలీకి అత్యంత ఆత్మీయుడు. చాలా టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు.. అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ ఉన్న వ్యక్తి. ఇటీవల నా వద్దకు వచ్చి తను హీరోగా సినిమా చేస్తున్నానని చెప్పగానే సరైన నిర్ణయమే తీసుకున్నాడాని అనిపించింది. ఎందుకంటే మన కళ్ళ ముందే డాన్స్ మాస్టర్లు లారెన్స్ రాఘవ, ప్రభుదేవా హీరోలుగా మారి మంచి సక్సెస్‌ను అందుకొన్న విషయాన్ని గుర్తు చేశారు.

Actor Nagababu best Wishes to Jani Master on launch of first movie as hero

జానీ మాస్టర్ అద్భుతమైన డాన్స్ ప్రతిభ‌తోపాటు అందంగా ఉంటాడు. మంచి కథతో హీరోగా ఇండస్ట్రీ‌లో నిలదొక్కుకుంటాడని నేను బలంగా నమ్ముతున్నాను. కానీ ఎంత పెద్ద హీరో అయినా, ఎంత మంచి సక్సెస్ వచ్చినా కొరియోగ్రఫీ మాత్రం వదలద్దని మాత్రం జానీకి నా వ్యక్తిగత అభిప్రాయం. ఇదే నా సలహా, కోరిక అంటూ నాగబాబు తెలిపారు. అలాగే ఇంకా పేరు పెట్టని J1గా వ్యవహరిస్తున్న చిత్రం భారీగా హిట్ అవ్వాలి, మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

అందంతో అదరగొడుతున్న దిగంగన.. జోష్ మామూలుగా లేదుగా..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X