దేవుడు చచ్చిపోయాడు.. రజినీకాంత్ మాటలకు కౌంటర్ ఇచ్చిన నాగబాబు

సినీ నటుడు నాగబాబు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచారు. గతంలో ఎప్పుడు లేని విదంగా ఆయన దేవుడు అనే కాన్సెప్ట్ చుట్టూ ఉహీంచని విధంగా స్పందించడం వైరల్ గా మారింది. గతంలో హిందు ధర్మ దేవుళ్లపై విమర్శలు చేసిన వారిపై ఘాటుగా స్పందించిన నాగబాబు ఈసారి మాత్రం దేవుడు అనే వాడే లేడు అంటూ కామెంట్ చేశారు. అదే విధంగా గతంలో రజినీకాంత్ చెప్పిన మాటలకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు.

దేవుడిపై సంచలన వ్యాఖ్యలు

దేవుడిపై సంచలన వ్యాఖ్యలు

జనసేన లీడర్ గా కొనసాగుతున్న నాగబాబు ఈ మధ్య కొన్ని రాజకీయ పరిస్థితులపై ఎవరు ఊహించని విధంగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే సామాజిక అంశాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇక మొదటిసారి ఆయన దేవుడు అనే కాన్సెప్ట్ అనేదే అబద్ధం అంటూ ఉహించని విధంగా ట్వీట్ చేయడం వైరల్ గా మారింది. ముందుగా రజినీకాంత్ దేవుడు గురించి చెప్పిన కొన్ని మాటలను కూడా ప్రస్తావించారు.

రజినీకాంత్ గారు అలా చెప్పారు..

రజినీకాంత్ గారు అలా చెప్పారు..

ఒకప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఒక మాట చెప్పారు. అది ఏమిటంటే.. మన కంటికి కనబడే ఏదయినా సరే ఎవరో ఒకరు క్రియేట్ చేసిందే అయ్యి ఉంటుందని. లేకపోతే ఆ వస్తువు కి ఉనికి ఉండదు. అలాగే ఇంత విశాల విశ్వం కూడా ఉనికి లో ఉందంటే ఎవరో ఒక క్రియేటర్ వుండే ఉండాలి. అతడే భగవంతుడు అని చాలా గంభీరంగా రజినీకాంత్ గారు చెప్పారు.

దేవుడిని క్రియేట్ చేసింది ఎవరు

దేవుడిని క్రియేట్ చేసింది ఎవరు

మరి అంత క్రియేట్ చేసిన దేవుడి ని క్రియేట్ చేసింది ఎవరు. ఒక శక్తి ఉనికి లో ఉందంటే దానికి ఒక క్రియేటింగ్ రీజన్ వేరే ఉండాలి. ఆ రీజన్ దేవుడిని క్రియేట్ చేసి ఉండాలి. అలాగే ఆ దేవుడిని క్రియేట్ చేసిన రీజన్ కి ఇంకో కారణం ఉండాలి. సో అలా వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే అంతు పొంతూ ఉండదు.. అంటూ మరొక సంచలన కామెంట్ చేశారు.

Recommended Video

Ram Charan & Upasana Celebrates 5 Years Of Wedding
 దేవుడు చచ్చిపోయాడు

దేవుడు చచ్చిపోయాడు

సో దేవుడు అనే కాన్సెప్ట్ కి మీనింగ్ ఏది లేదు. సో దేవుడు ఇన్వాల్మెంట్ లేకుండా మన జీవితాల్ని మనం ఇష్టం ఉన్నట్లుగా జీవించాలి. ప్రముఖ తత్వవేత్త చెప్పినట్లు" చాలా రోజుల క్రితమే దేవుడు చనిపోయాడు. అందుకే ఎలాంటి వర్రీస్ లేకుండా, దేవుడిపై ఆధారపడకుండా కేవలం చట్టాలకు న్యాయలకు అనుగుణంగా బ్రతకాలి'' అంటూ నాగబాబు సరికొత్తగా ట్వీట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో నాగబాబు చేసిన కామెంట్స్ పై నెటీజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X