Don't Miss!
- News రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
‘బొమ్మ బ్లాక్ బస్టర్’.. నందు స్ట్రాటజీ అదుర్స్!!
గీతా మాధురి భర్త, నటుడు నందు సోషల్ మీడియాలో చాలానే వేషాలు వేశాడు. గత రెండు మూడు రోజులుగా ఎక్కడ చూసిన నందు వార్తలే. బీబీ అంటూ నందు సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే బీబీ అంటే బిగ్ బాస్ అని కాదని తెలిసినా.. అసలు సంగతి తెలుసుకోవాలన్న ఆత్రుత అందరిలోనూ కలిగించేలా చేశాడు. ఈ విషయంలో నందు స్ట్రాటజీ వర్కౌట్ అయింది. మొత్తానికి బీబీ అంటే ఏంటో అందరికీ చెప్పేశాడు.
డార్లింగ్స్ నేను BBలో ఉన్నాను.. BBలో మన రచ్చ మామూలుగా ఉండదు.. ఎంతో వినోదాన్ని పంచడానికి మీ ముందుకు వస్తున్నాను.. మీ మద్దతు మరింత కావాలి.. రేపు (ఆగస్ట్ 25) సాయంత్రం ఆరుగంటలకు ఇంకో అప్డేట్ రెడీగా ఉంది.. చూస్తూనే ఉండండి అని నిన్నంటి నుంచి ఊరిస్తూ వచ్చిన నందు ఎట్టకేలకు తాజాగా అప్డేట్ ఇచ్చాడు. తన కొత్త సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు.
విజయీభవ ఆర్ట్స్‌పై రాజ్ విరాట్ దర్శకత్వం వహిస్తోన్న తన సినిమా టైటిల్ బొమ్మ బ్లాక్ బస్టర్ అని చెప్పేశాడు. ప్రవీన్ పగడాల, బోసుబాబు, ఆనంద్ రెడ్డి, మనోహర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు ప్రకటించాడు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతాన్ని సమకూరుస్తున్నట్టు తెలిపాడు. మొత్తానికి నందు తన సినిమాను బాగానే ప్రమోట్ చేసుకుంది. ఈ తరహాలో ప్రమోట్ చేసుకుని ఇంతలా క్యాష్ చేసుకున్నది కేవలం నందు ఒక్కడే. ఏది ఏమైనా నందు సినిమా టైటిల్ జనాల్లోకి బాగానే వెళ్లేట్టు కనిపిస్తోంది.