twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బొమ్మ బ్లాక్ బస్టర్’.. నందు స్ట్రాటజీ అదుర్స్!!

    |

    గీతా మాధురి భర్త, నటుడు నందు సోషల్ మీడియాలో చాలానే వేషాలు వేశాడు. గత రెండు మూడు రోజులుగా ఎక్కడ చూసిన నందు వార్తలే. బీబీ అంటూ నందు సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే బీబీ అంటే బిగ్ బాస్ అని కాదని తెలిసినా.. అసలు సంగతి తెలుసుకోవాలన్న ఆత్రుత అందరిలోనూ కలిగించేలా చేశాడు. ఈ విషయంలో నందు స్ట్రాటజీ వర్కౌట్ అయింది. మొత్తానికి బీబీ అంటే ఏంటో అందరికీ చెప్పేశాడు.

    డార్లింగ్స్ నేను BBలో ఉన్నాను.. BBలో మన రచ్చ మామూలుగా ఉండదు.. ఎంతో వినోదాన్ని పంచడానికి మీ ముందుకు వస్తున్నాను.. మీ మద్దతు మరింత కావాలి.. రేపు (ఆగస్ట్ 25) సాయంత్రం ఆరుగంటలకు ఇంకో అప్డేట్ రెడీగా ఉంది.. చూస్తూనే ఉండండి అని నిన్నంటి నుంచి ఊరిస్తూ వచ్చిన నందు ఎట్టకేలకు తాజాగా అప్డేట్ ఇచ్చాడు. తన కొత్త సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు.

    Actor Nandu Bomma Blockbuster First Look Goes Viral

    విజయీభవ ఆర్ట్స్‌పై రాజ్ విరాట్ దర్శకత్వం వహిస్తోన్న తన సినిమా టైటిల్ బొమ్మ బ్లాక్ బస్టర్ అని చెప్పేశాడు. ప్రవీన్ పగడాల, బోసుబాబు, ఆనంద్ రెడ్డి, మనోహర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు ప్రకటించాడు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతాన్ని సమకూరుస్తున్నట్టు తెలిపాడు. మొత్తానికి నందు తన సినిమాను బాగానే ప్రమోట్ చేసుకుంది. ఈ తరహాలో ప్రమోట్ చేసుకుని ఇంతలా క్యాష్ చేసుకున్నది కేవలం నందు ఒక్కడే. ఏది ఏమైనా నందు సినిమా టైటిల్ జనాల్లోకి బాగానే వెళ్లేట్టు కనిపిస్తోంది.

    English summary
    Actor Nandu Bomma Blockbuster First Look Goes Viral
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X