ప్రకాష్ రాజ్ కి షాకింగ్ కౌంటర్ ఇచ్చిన నరేష్.. నీళ్ళు నింపకుండా దూకుతావా ఏంది?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సినిమా వర్గాలకే కాక రెండు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.. లెక్క ప్రకారం ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న నరేష్ ప్యానల్ పదవీకాలం సెప్టెంబర్ వరకు ఉంటుంది.. అయితే ఈసారి అధ్యక్షుడు బరిలో దిగాలని భావించిన ప్రకాష్ రాజ్ ఏప్రిల్ నెలలో ఎన్నికలు ఎప్పుడూ ఉంటాయి అనే అంశం మీద క్లారిటీ కోరుతూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఒక లేఖ రాశాడు, ఈ లేఖకు స్పందిస్తూ ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్న జీవిత రాజశేఖర్ ఆయనకు సమాధానం కూడా ఇచ్చారు.

కరోనా పరిస్థితుల్లో జనరల్ బాడీ మీటింగ్ జరగడం లేదని సాధారణంగా ఎన్నికలకి వెళ్ళాలి అంటే జనరల్ బాడీ మీటింగ్ లో ఒక నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. అంతేగాక ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డిస్ప్లే యాక్షన్ కమిటీ చైర్మన్ గా ఉన్న కృష్ణంరాజు గారికి ఒక లేఖ రాశామని ఆయన నుంచి రిప్లై రాగానే ఎన్నికల కు సంబంధించిన ప్రక్రియ గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుందని రిప్లై ఇచ్చారు. అయినా సరే వెనక్కి తగ్గిన ప్రకాష్ రాజ్ తన ఎన్నికల లోకి దిగుతున్న అంటూ ప్రకటించి తన పానెల్ తో సహా మీడియాకెక్కారు. ఆ తర్వాత ఈ అంశాన్ని నరేష్ వర్గం కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఖండించింది.

Actor naresh counter to prakash raj

అయితే నిన్న ఎలక్షన్స్ ఎప్పుడు ? అంటూ తెలుగు లో ప్రకాష్ రాజ్ ట్వీట్ చేయడంతో ఈరోజు దానికి నరేష్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి క్లియర్ గా సమాధానం ఇచ్చాక కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఏమి అనాలో అర్థం కావడం లేదని అన్నారు. జనరల్ బాడీ ఎలక్షన్స్ లో ఒక రిజల్యూషన్ తీసుకున్నాక దీని మీద ఒక నిర్ణయానికి వస్తామని, కానీ ఎప్పుడూ అని కొంతమంది అడుగుతున్నారు అని ప్రశ్నించారు. ఇదెలా ఉందంటే స్విమ్మింగ్ పూల్ లో నీళ్ళు నింపకుండానే నేను దూకి ఈదనా అని అడుగుతున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X