twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sai Dharam Tej మా ఇంటి నుంచే వెళ్ళాడు.. నాకొడుకు కూడా అలానే అంటూ నరేష్ సంచలనం!

    |

    మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో మెగా అభిమానులు సహా తెలుగు ప్రేక్షకులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే రోడ్డు ప్రమాదం అతివేగం కారణంగా జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదం గురించి నటుడు నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

    Recommended Video

    Hero Sai Dharam Tej యాక్సిడెంట్ పై స్పందించిన Actor Naresh || Filmibeat Telugu
    తీవ్రంగా గాయపడి

    తీవ్రంగా గాయపడి


    సైబరాబాద్‌ కమిషనరేట్‌ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐకియా స్టోర్‌ సమీపంలో ఉన్న కోహినూర్ హోటల్ దగ్గరలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో సాయి ధరమ్‌ తేజ్‌ గాయపడ్డాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు, తదుపరి హెల్త్ బులెటిన్ రేపు ఉదయమే విడుదల కానుంది.

    ఇసుక వలనే

    ఇసుక వలనే

    సాయి ధరమ్‌ తేజ్‌ బైక్‌ ప్రమాదానికి గురైన ప్రాంతంలో రోడ్డు పక్కన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ నిర్మాణానికి సంబంధించిన ఇసుక, మట్టి రోడ్డుపై పడడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కేబుల్‌ బ్రిడ్జి నుంచి ఐకియా వరకు రోడ్డుపై ఎక్కడా ఇసుక లేదు, కేవలం సాయి ధరమ్‌ తేజ్‌ బైక్‌ ప్రమాదం జరిగిన ప్రాంతంలో మాత్రమే ఇసుక ఉందని అంటున్నారు.

    నరేష్ సంచలనం

    నరేష్ సంచలనం

    ఇక ఇప్పటికే సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున తేజ్ కుటుంబసభ్యులను పరామర్శిస్తున్నారు. చిరంజీవి , పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ , నిహారిక, మెగాస్టార్ సతీమణి సురేఖ ఇలా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆసుపత్రికి వెళ్లి తేజ్ ను ఎప్పటికప్పుడు గమనిస్తూ పరామర్శిస్తున్నారు. అయితే తాజాగా సీనియర్ నటుడు నరేష్ ఈ ప్రమాదంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    నా కొడుకుతో ఒట్టు వేయించుకున్నా

    నా కొడుకుతో ఒట్టు వేయించుకున్నా

    బైక్ రైడింగ్ విషయంలో చాలా సార్లు నా కొడుకుని, సాయి ధరమ్ తేజ్‌‌ని హెచ్చరించానని ఆయన అన్నారు. తేజ్ కూడా నాకు బిడ్డ లాంటి వాడేనని పేర్కొన్న ఆయన నిన్న సాయంత్రం నా ఇంటి నుంచే సాయి ధరమ్ తేజ్ బయలుదేరాడని, గతంలో కూడా బైక్స్ ఫై తేజ్, నా కొడుకు ఇద్దరూ రైడ్స్‌కి వెళ్లేవాళ్లని పేర్కొన్న ఆయన నాలుగు రోజుల క్రితమే ఇద్దరికి కౌన్సిలింగ్ కూడా ఇద్దాం అనుకున్నానని అన్నారు.

    రేసింగ్ కోణంలో

    రేసింగ్ కోణంలో

    తాను బైక్ ప్రమాదానికి గురైనప్పుడు తన అమ్మ బైక్ మీద వెళ్లనని ఒట్టు వేయించుకుందని బైకులు ముట్టుకోకుండా ఉండడం మంచిదని ఆయన అన్నారు. ఇక తేజ్ త్వరగానే కోలుకుంటాడని ఆశాభావం వ్యకం చేసిన ఆయన పూర్తి ఆరోగ్యంతో త్వరలోనే తిరిగి సినిమాలు చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. సాయి ధరమ్ తేజ్ ప్రమాదం కేసులో పోలీసులు కూపీ లాగుతున్నారని అంటున్నారు. ఇక ఇప్పటికే 336 ఐపీసీ , 184 ఎంవీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసిన పోలీసులు రేసింగ్ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

    పరీక్షలు

    పరీక్షలు

    ఇక అపోలోలో తేజ్ ను పరామర్శించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ వినాయకుడి దయవల్ల ఏం కాలేదన్న ఆయన చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని అన్నారు. హెల్మెట్, షూస్, జాకెట్ వేసుకోవడం వల్ల ఏం కాలేదన్న ఆయన సాయి తేజ్ పై అసత్య ప్రచారాలు చేయవద్దని, వైద్యులు ఎప్పటికప్పుడి పరీక్షలు నిర్వహిస్తున్నారని అన్నారు.

    English summary
    Actor Naresh made some Emotional Comments on Sai Dharam Tej Bike Accident, he said dharam tej left from his house.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X