twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Naresh Pavitra Lokesh: పవిత్రా లోకేష్ పై అలా చేయి వేసి.. నరేష్ రొమాంటిక్ గా..

    |

    గ్లామర్ ప్రపంచంలో రెండు, మూడు పెళ్లిల్లు, అఫైర్లు సాధారణంగా జరిగే వ్యవహారాలే. అందులో కొన్ని హైలెట్ అవుతే కొన్ని ఇంకొకరికి తెలియకుండానే కనుమరిగిపోతాయి. అయితే ఇటీవల సినీ హీరోల కంటే మోస్ట్ పాపులర్ గా మారింది నటుడు నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్ రిలేషన్ షిప్. వీరిద్దరు లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారని, త్వరలోనే వివాహంతో ఒక్కటి కానున్నారని, అందుకోసం పలు ఆలయాలు కూడా చుడుతున్నారని వార్తలు తెగ హల్ చల్ చేశాయి.

    ఈ వార్తలపై నరేష్, పవిత్రా తమ స్టైల్ లో క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే నరేష్ మూడో భార్య రమ్య మీడియా వేదికగా రచ్చ చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం సద్దుమణిగినా.. వాళ్లిద్దరు కలిసే ఉంటున్నారనేది సమాచారం. అయితే తాజాగా వీరిద్దరు కలిసి ఒక వీడియో వదిలారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

    నరేష్, పవిత్రా కలిసి ఓ వీడియోలో..

    నరేష్, పవిత్రా కలిసి ఓ వీడియోలో..

    సీనియర్ నటుడు నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్ లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీని తర్వాత నరేష్ మూడో భార్య రమ్య మీడియాలో హల్ చల్ చేయడంతో ఈ వివాదం హైలెట్ గా మారింది. అలాగే నరేష్, పవిత్రా లోకేష్ సోషల్ మీడియా వేదికగా తాము మంచి ఫ్రెండ్స్ అంటూ క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం కూడా చేశారు.

    ఇక ఇప్పటికైతే ఈ వ్యవహారం సద్దుమణిగింది. కానీ తాజాగా నరేష్, పవిత్రా కలిసి ఓ వీడియోలో దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే ఈ వీడియో దేనికోసమంటే.. ''అందరూ బాగుండాలి అందులో నేనుండాలి'' సినిమా గురించి ఈ వీడియో చేశారు.

    భుజాలను తాకుతూ చాలా ఎనర్జీగా..

    భుజాలను తాకుతూ చాలా ఎనర్జీగా..

    కమెడియన్ అలీ హీరోగా నటించిన చిత్రమే ''అందరూ బాగుండాలి అందులో నేనుండాలి''. ఈ సినిమా థియేటర్లో కాకుండా నేరుగా ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో శుక్రవారం అంటే ఇవాళ విడుదలైంది. ఈ చిత్రంపై చాలా పాజిటివ్ గా రివ్యూలు వస్తున్నాయని తెలియజేసేందుకే నరేష్, పవిత్రా లోకేష్ ఇలా వీడియోలో దర్శనమిచ్చారు.

    ఈ వీడియోలో చాలా ఉత్సాహంగా సినిమాకు వస్తున్న సక్సెస్ టాక్ గురించి తెలిపాడు నరేష్. అంతేకాకుండా పవిత్రా లోకేష్ భుజాలను మాటిమాటికి తాకుతూ చాలా ఎనర్జీగా సినిమా గురించి చెప్పుకొచ్చాడు. ఈ వీడియో చూస్తే వాళ్లిద్దరు రిలేషన్ లో ఉన్నారనే అనుమానం కలుగుతోంది.

    వందల మెసేజ్ లు వస్తుంటే..

    ఇక ఆ వీడియో విషయానికొస్తే.. ''అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమా రివ్యూలను నైట్ నుంచి చదువుతూనే ఉన్నాం. చాలా బాగుందని అందరు చెబుతున్నారు. దాదాపు 41 రివ్యూలు చదివాను. అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి. ఈ మధ్య ఇలాంటి పాజిటివ్ రివ్యూలు ఏ సినిమాకు రాలేదు.

    అలీ, డైరెక్టర్ కిరణ్, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. ఇద్దరు చైల్డ్ ఆర్టిస్ట్ లు హీరోలుగా పలు సినిమాలు చేసి ఆర్టిస్టులుగా చేసి, మళ్లీ హీరోలుగా చేసిన సినిమాకు మంచి రిజల్ట్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. నాకు వందల మెసేజ్ లు వస్తుంటే చాలా సంతోషమేసింది. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి'' అని నరేష్ తెలిపారు.

    నాకు చదివి చెప్పలేదుగా..

    నాకు చదివి చెప్పలేదుగా..

    ఈ వీడియోలో నరేష్ ఇలా మాట్లాడే సమయంలో మధ్యలో పవిత్రా లోకేష్ మాట్లాడుతూ.. ''రాత్రి నుంచి రివ్యూస్ అన్నీ చదివాను. చాలా బాగున్నాయి'' అని అంటుండగా ''నాకు నువ్వు తెలుగు చదివి చెప్పలేదుగా'' అని నరేష్ అంటే పవిత్రా లోకేష్ నవ్వింది. తర్వాత కొనసాగించినా పవిత్రా లోకేష్.. ప్లీజ్ వాచ్ ఇన్ ఆహా.. నటీనటులు అలీ, నరేష్ లాంటి ఇతరులను ఎంకరేజ్ చేయండి అని తెలిపింది.

    ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నరేష్ ను చూసిన నెటిజన్లు వెరీ రొమాంటిక్ ఆ.. అని అనుకుంటున్నారు. ఇలా ఈ వీడియోతో వాళ్లు రిలేషన్ లో ఉన్నట్లు చెప్పకనే చెబుతున్నట్లుగా తెలుస్తోంది.

    English summary
    Senior Actor And Character Artist Pavitra Lokesh Review On Ali Starrer Andaru Bagundali Andulo Nenundali Movie. Video Goes Viral In Social Media
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X