Actor Naresh: "ఆ ఒక్క దాని కోసం రోజంతా ఏడుస్తూనే ఉన్నాను.. అదెప్పటికీ మర్చిపోలేను"
సీనియర్ నటుడు నరేష్ విజయ కృష్ణ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న ఈయన ఇటీవలే మూడో పెళ్లి చేసుకుని అనేక వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ముఖ్యంగా సోషల్ మీడియా మొత్తం ఈయన మూడో పెళ్లి గురించి పెద్ద ఎత్తున రచ్చే సాగింది. కానీ ప్రస్తుతం ఇవన్నీ సర్దు మణిగాయి. హాయిగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు నరేష్.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు నరేష్.. షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా ఆయన సినీ జీవితంలో జరిగిన అనేక విషయాల గురించి ప్రత్యేకించి చెప్పుకొచ్చారు. ఈక్రమంలో తాను ఒక సినిమా కోసం ఒక రోజంతా ఏడ్చానంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆ సినిమా ఏంటి, ఆయన ఎందుకోసం అంతలా ఏడ్చారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం 64 ఏళ్ల వయసు కల్గిన నటుడు నరేష్.. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నారు. బాలనటుడిగా కెరియర్ ప్రారభించిన ఈయన ఆ తర్వాత హీరోగా చేశాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తున్నారు. అనేక అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ.. తెలుగు సినీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు. ఈయన తన అద్భుతమైన నటనతో నవ్వించడంతో పాటు ఏడిపించడంలోనూ ముందు ఉంటాడు.

అయితే రామ్ చరణ్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్టు సినిమా రంగస్థలం సినిమాలో తండ్రి పోషించిన ఈయన.. ఆ సినిమాలో ఎక్కువగా గంభీరంగా, ఏడుస్తూనే కనిపిస్తారు. ముఖ్యంగా తన పెద్ద కొడుకు, రామ్ చరణ్ అన్నయ్య క్యారెక్టర్ చనిపోయినప్పుడు మాత్రం విపరీతంగా ఏడ్చేశారు. నరేష్ ఈ క్యారెక్టర్ లో నటించారు అనడం కూడా జీవించారు అనడం కరెక్ట్.

అంత మంచి పాత్రలో చక్కగా నటించిన ఈయన.. ఆది పినిశెట్టి క్యారెక్టర్ చనిపోయినప్పుడు చేసిన నటన కోసం రోజంతా ఏడుస్తూనే ఉన్నారట. అలా ఏడిస్తేనే ఈ పాత్రకు న్యాయం చేసిన వాడివి అవుతానని.. డైరెక్టర్ సుకుమార్ రోజంతా ఏడవమని చెప్పారట. అలా "ఓరయ్యో.. నా అయ్యా.." అంటూ సాగిన పాట కోసం రోజంతా ఏడుస్తూనే ఉన్నారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











