"మా నాన్న నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నా.. నేను చేసుకోకపోవడానికి కారణం అదే"

విజయ నిర్మల కొడుకు.. సీనియర్ నటుడు నరేష్ గురించి అందరికీ తెలిసినా.. ఆయన మొదటి కుమారుడు నవీన్ గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. అయితే కుమారుడికి పెళ్లి చేయాల్సిన వయసులో నరేష్ నాలుగో పెళ్లి చేసుకోవడంపై ఆయన తాజాగా షాకింగ్ కామెంట్లు చేశారు. తన తండ్రి నలుగురిని పెళ్లి చేసుకున్నా తాను ఇప్పటికీ చేసుకోకపోవడానికి గల కారణాలను వివరించారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా నరేష్ మొదటి సారి సీనియర్ కెమెరామెన్ శ్రీను కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు నవీన్ జన్మించిన తర్వాత మనస్ఫర్ధల కారణంగా విడిపోయారు. తర్వాత రెండో పెళ్ళి చేసుకున్నాక అది కూడా విడాకుల వరకు వచ్చింది. ఇక ఆయనకు 50 ఏళ్ల వయసు వచ్చాకా.. తన కొడుకు వయసు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయనాయకుడు అయిన రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె రమ్యను పెళ్లి చేసుకున్నారు. 2010లో వీరికి పెళ్లి కాగా ఆ తర్వాత వీరికి ఓ బాబు జన్మించాడు. అయితే కొంత కాలానికి వీరికి కూడా గొడవలు ప్రారంభం అయ్యాయి.

Actor Naresh Son naveen Shocking Comments About His Marriage Check Details

దీంతో నరేష్ ఈమెకు కూడా విడాకులు ఇవ్వాలనుకున్నాడు. కానీ ఆమె మాత్రం ఇవ్వనని తెగేసి చెప్పింది. దీంతో ఈయన నటి పవిత్రా లోకేష్ తో డేటింగ్ చేయడం ప్రారంభించారు. వీరిద్దరూ అధికారికంగా పెళ్లి చేసుకున్నట్లు చెప్పకపోయినా.. కలిసే ఉంటున్నారు. లేటు వయస్సులో వీరిద్దరి ఘాటు ప్రేమ గురించి పేపర్లు, టీవీలు, సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయి. వీరిద్దరూ కలిసే ఉంటున్నారని, ఇద్దరి మధ్య సంబంధం ఉందన్న విషయం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరీ తెలుసు.

అయితే కొడుకుకు పెళ్లి చేయాల్సిన వయసులో తండ్రి నాలుగో పెళ్లి చేసుకోవడంపై నవీన్ కు ప్రశ్నలు ఎదురు అయ్యాయి. ఇటీవలే ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా... ఇంత వయసు వచ్చినా మీరు ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనగా.. నాకు ఇప్పుడే చేసుకోవాలని లేదని చెప్పాడు. తాను కెరియర్ లో బాగా ఎదగాలని చెప్పాడు. అలాగే తనకు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోవాలని అనిపించలేదని వివరించాడు. అలాగే మీ తండ్రి నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు కదా అని అనగానే.. అది ఆయన ఇష్టం.. ప్రతీ మనిషికి ఇష్టా ఇష్టాలు ఉంటాయని చెప్పుకొచ్చాడు.

Actor Naresh Son naveen Shocking Comments About His Marriage Check Details

ముఖ్యంగా తన తండ్రి దగ్గరి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని... ఏ విషయంలో అయినా సరే తనకు నచ్చిన పని చేస్తూనే ఉంటారని నవీన్ వివరించాడు. తన తండ్రి ఎక్కడా కాంప్రమేజ్ కాకుండా.. ఎవరేమంటారని కూడా పట్టించుకోకుండా తనకు నచ్చిన పనులు చేసుకుంటున్నారని పేర్కొన్నాడు. తాను కూడా తండ్రిలాగే తనకు నచ్చిన పని మాత్రమే చేస్కుంటూ ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను ఎడిటర్ గా పని చేస్తున్నానని కెరియర్ లో ఎదగడమే తన లక్ష్యం అని వెల్లడించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X