డ్రగ్స్ కేసులో రకుల్ పేరు వైరల్.. నాకేమి బాధ లేదు, పనికొచ్చే పనులు చేద్దాం: నవదీప్ కౌంటర్
అసలు బాలీవుడ్ లో జరిగింది ఏంటి ? జరుగుతున్నది ఏంటి? సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి గల రహస్యాలను కనుగొంటారని అనుకుంటే కలలో కూడా ఊహించని విధంగా కేసు యూ టర్న్ తిరిగిందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక రియా డ్రగ్స్ వ్యవహారం అటు ఇటు తిరిగి చివరికి టాలీవుడ్ ని టచ్ అవ్వడం గత రెండు రోజుల నుంచి హాట్ టాపిక్ గా మారింది.
Recommended Video

సినిమా ఇండస్ట్రీలపై ఫోకస్
ఇదివరకే ఒకసారి ఆ విషయంలో టాలీవుడ్ కి కోలుకోలేని దెబ్బ పడింది. డ్రగ్స్ వ్యవహారంలో ఒక్క చిన్న ఆధారం దొరికినా ఎక్కడో ఒక చోట సినిమా ఇండస్ట్రీల వైపు ఫోకస్ పడుతోంది. ఇక రియా చక్రవర్తి, ఆమె సోదరుడు కూడా డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నట్లు బయటపడడంతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసి సినిమా ఇండస్ట్రీలను షాక్ కి గురి చేసింది.

రకుల్ పేరు వైరల్
ఇక టాలీవుడ్ నుంచి కూడా రకుల్ ప్రీత్ సింగ్ ని విచారించడం చర్చనీయాంశంగా మారింది. NCB ఆమెను విచారించి మరికొందరి పేర్లను బయటపెట్టనుందని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. రియా, రకుల్ స్నేహితులు కావడంతో వారికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. ఇక rakulpreetsingh అనే హ్యాష్ ట్యాగ్ తో 30వేల ట్వీట్స్ వేలువడడం అందరిని షాక్ కి చేసింది.

జాగ్రత్త.. నవదీప్..
ఇక ఇదే విషయంపై ఒక నెటిజన్ నవదీప్ ని ప్రశ్నించగా ఈ టాలెంటెడ్ యాక్టర్ కూడా ఎవరు ఊహించని విధంగా సమాధానం ఇచ్చాడు. ఈ వ్యవహారం మళ్ళీ టాలీవుడ్ వైపు యూ టర్న్ తీసుకుంది, నవదీప్ అన్నా మనకు కూడా ఈ బాధలు తప్పేలా లేవు. కాస్త జాగ్రత్త అంటూ ఒక నెటిజన్ సెటైర్స్ వేశాడు.

పనికొచ్చే పనులు చేద్దాం..: నవదీప్
అందుకు సమాధానంగా నవదీప్ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. నాకు ఎలాంటి బాధ లేదు బ్రదర్.. నువ్వు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. పద పనికొచ్చే పనులు చేద్దాం.. అని నవదీప్ స్వీట్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. దీంతో ఒక్కసారిగా ఈ విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ఇంకెంత మంది పేర్లు బయటకు వస్తాయో?
ఇక బాలీవుడ్ లో ఒక్కరి పేరు బయటపడినందుకే దాదాపు 25 మంది పేర్లు బయటకు వచ్చాయి. ఇక రకుల్ ప్రీత్ సింగ్ ద్వారా ఇంకెంత మంది పేర్లు బయటకు వస్తాయో అనే అనుమానం కలుగుతోంది. ఒక విధంగా డ్రగ్స్ గాయం నుంచి దాదాపు కోలుకున్న టాలీవుడ్ కి ఇప్పుడు రియా వ్యవహారం టెన్షన్ కి గురి చేస్తోంది.


Click it and Unblock the Notifications











